‘బాహుబలి‘ కోసం ప్రభాస్ ఐదేళ్లు సమయాన్ని కేటాయించినట్టే.. కన్నడ స్టార్ యశ్ కూడా దాదాపు ఐదేళ్ల తన సమయాన్ని ‘కె.జి.యఫ్‘ కోసం కేటాయించాడు. అది మామూలుగా వర్కవుట్ అవ్వలేదు. అంతకుముందు వరకూ కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన యశ్ ని.. ‘కె.జి.యఫ్‘ పాన్ ఇండియా స్టార్ గా మార్చింది. ఇక.. ‘కె.జి.యఫ్ 2‘ విడుదలై ఏడాదిన్నర దాటిపోయినా ఇప్పటివరకూ కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే.. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది.
యశ్ 19వ సినిమాకి ముహూర్తం ఫిక్సైంది. డిసెంబర్ 8న యశ్ 19కి సంబంధించి అనౌన్స్ మెంట్ రాబోతుంది. అందుకు సంబంధించిన క్వశ్చన్ మార్క్ తో కూడిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
కన్నడలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతుంది. అలాగే.. యశ్ 19 కి దర్శకత్వం వహించేది ఎవరు? నటీనటులు ఎవరు? అనే విషయాలు ఆరోజే తెలియనున్నాయి. ‘కె.జి.యఫ్‘ తర్వాత రాకింగ్ స్టార్ యశ్.. శంకర్ డైరెక్షన్ లో నటిస్తాడని.. లోకేష్ కనకరాజ్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. అతని డైరెక్టర్స్ లిస్టులో మలయాళం డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పేరు కూడా వినిపించింది. డిసెంబర్ 8నే యశ్ కొత్త సినిమా డైరెక్టర్ విషయంలో క్లారిటీ రానుంది.
Natural Star Nani is on a good streak. He has a string of hits to…
తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…
ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…
నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…
'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…
నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…