అంతర్జాతీయ వేదికపై ‘పుష్ప‘.. జర్మనీ వెళ్లిన అల్లు అర్జున్

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటిస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్‘ను ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేయడమే కాదు.. ఆ సినిమాతో అవార్డుల వర్షం కురిపించాడు. అంతర్జాతీయంగా ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు ‘ఆర్.ఆర్.ఆర్‘కి దక్కాయి. ఇక.. ‘ఆర్.ఆర్.ఆర్‘తో పాటు గత జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన మరో చిత్రం ‘పుష్ప‘. ఈ సినిమాతో ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు అల్లు అర్జున్.

ఇప్పటికే జాతీయ స్థాయిలో దుమ్మురేపిన పుష్పరాజ్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లోనూ సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకూ జర్మనీలోని బెర్లిన్ లో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ వేడుకలో పాల్గొనడానికి ప్రత్యేకంగా జర్మనీ వెళ్లాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి

Related Posts