‘రాజధాని ఫైల్స్‘ ప్రదర్శనకు బ్రేక్

ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా ఉండాలంటూ రైతులు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్‘. వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారా అఖిలన్, వీణా నటీనటులుగా పరిచయమయ్యారు. భాను దర్శకత్వంలో కంఠంనేని రవి శంకర్ నిర్మించిన ‘రాజధాని ఫైల్స్‘ ఈరోజు విడుదలైంది.

అయితే.. మార్నింగ్ షోస్ కూడా పడిన ‘రాజధాని ఫైల్స్‘ ప్రదర్శనకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రం విడుదల నిలిపేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని నిర్మాతలను ఆదేశిస్తూ విడుదలపై రేపటి వరకు స్టే ఇచ్చింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని థియేటర్లలో మార్నింగ్ షోలు మధ్యలోనే సినిమాని నిలిపివేయడంతో ‘రాజధాని ఫైల్స్‘ చిత్రాన్ని ప్రదర్శించాలంటూ థియేటర్ల ముందు ప్రేక్షకులు నిరసన చేస్తున్నారు.

Related Posts