ఆపరేషన్‌ వాలెంటైన్‌ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ : నిర్మాత సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని

వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ మెయిన్ లీడ్ గా సోని పిక్చర్స్‌ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మించిన మూవీ ఆపరేషన్‌ వాలెంటైన్‌. శక్తి ప్రతాప్‌ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 1 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
శక్తి ప్రతాప్‌ సింగ్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ షార్ట్ ఫిల్మ్‌ నచ్చింది. అతను ఈ కథ చెప్పినపుడు వరుణ్‌కి, నాకూ నచ్చడంతో సినిమా చేయడానికి బీజం పడిందన్నారు నిర్మాత సిద్దు. సోనీ పిక్చర్స్ భాగస్వామి కావడంతో తెలుగు హిందీ భాషల్లో నిర్మాణం సాధ్యమయ్యిందన్నారు.


విఎఫ్‌ఎక్స్‌ పట్ల అనుభవం అవగాహన, స్కిల్ ఉన్న వ్యక్తి శక్తి ప్రతాప్ సింగ్.. ఫైటర్‌ తర్వాత ఎయిర్‌ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అతిపెద్ద సినిమా ఇదన్నారు.గ్వాలియర్ ఎయిర్ బేస్ లో సినిమాని షూట్ చేశాం. అందుకే విజువల్స్ అంత నేచురల్ గా ఎఫెక్టివ్ గా వచ్చాయి. దర్శకుడు టెక్నికల్ గా చాలా సౌండ్. అన్ని విభాగాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు.ఎయిర్‌ ఫోర్స్ అధికారులు ఈ సినిమాని చూసి చాలా శాటిస్ఫై అయ్యారు. సంతోషాన్ని వ్యక్తం చేసారు. ప్రశంసించారు. సైనికులు త్యాగాలని, ధైర్య సాహసాలని స్మరించుకుంటూ వాళ్ళ కథని ప్రేక్షకులకు చూపించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేస్తున్న క్రమంలో ఇలాంటి రియల్ హీరోస్ సినిమాలు మరిన్ని చేయాలనే స్ఫూర్తి కలిగిందన్నారు.


వరుణ్‌ తేజ్‌ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారన్నారు. హిందీ, తెలుగు వెర్షన్స్‌ రెండింట్లో వరుణ్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ని జోరుగా చేస్తున్నారన్నారు.తనది ఐటి బ్యాక్‌డ్రాప్‌ అయితే.. సోనీ వారిది కార్పొరేట్ స్టైల్‌ అన్నారు. ఈ వర్క్‌ ఎక్స్‌పీరియెన్స్‌ చాలా డిఫరెంట్‌ అన్నారు.మిక్కి జే మేయర్‌ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. తెలుగు ఫ్లేవర్‌ మిస్‌ కాకుండా యూనిక్‌ స్టైల్లో మ్యూజిక్‌ చేసారన్నారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌ అన్నారు.ఖచ్చితంగా. నాకు అందరి హీరోలతో సినిమాలు చేయాలని వుంది. నితిన్ తో ఓ సినిమా అనుకుంటున్నాం. ప్రస్తుతం నా దృష్టి ‘ఆపరేషన్ వాలెంటైన్’ విడుదలపై వుందన్నారు.

Related Posts