Movies

‘ఓజీ‘ మాదే అంటోన్న డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్

పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఓ పెద్ద పవర్ ఉంది. ఆన్ స్క్రీన్ పై పవర్ స్టార్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు. ఇక.. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్, స్టైల్స్ ను పర్ఫెక్ట్ గా ఆవిష్కరిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. ఇప్పుడు ‘ఓజీ‘ మూవీతో అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు డైరెక్టర్ సుజీత్. ‘ఆర్.ఆర్.ఆర్‘ వంటి గ్లోబల్ మూవీ తర్వాత డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ఇప్పటికే ‘ఓజీ‘ మూవీ కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే.. ఈ సినిమా డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మారుతుందనే న్యూస్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలను ఖండిస్తూ.. తాజాగా ఈ సినిమా నిర్మాణం విషయంలో క్లారిటీ ఇచ్చింది డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్.

‘ఓజీ‘ విషయంలో వస్తున్న రూమర్స్ ను నమ్మొద్దని.. ఈ సినిమా తమదే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘ఓజీ‘ పై తమకు ఫుల్ క్లారిటీ ఉందని.. ఈ సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ తెలిపింది. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Telugu 70mm

Recent Posts

‘పుష్ప 2’ ఆగమనానికి 75 రోజులు మాత్రమే!

ఈ ఏడాది థియేటర్లలోకి రాబోతున్న చిత్రాలలో 'పుష్ప 2' ఒకటి. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో…

4 hours ago

నిఖిల్ ‘స్వయంభు’ ప్రపంచంలోకి సెంథిల్ కుమార్

'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకున్నాడు నిఖిల్. ఒకవిధంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతోన్న డివోషనల్ ట్రెండ్…

4 hours ago

What Is The Real Reason Behind The Postponement Of ‘OG’

Pawan, who has been releasing one film per year in his re-entry, has been rumored…

5 hours ago

‘Maname’ Trailer.. Sharwanand’s Colorful Romantic Drama

'Maname' is a romantic drama starring hero Sharwanand. This is the 35th film in Sharwanand's…

5 hours ago

Catherine Tresa

9 hours ago

ఫన్ అండ్ ఎమోషనల్ గా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్

విభిన్నమైన పాత్రలతో క్యారెక్టర్ యాక్టర్ గా ఫుల్ బిజీగా సాగుతోన్న అజయ్ ఘోష్ హీరోగా నటించిన చిత్రం 'మ్యూజిక్ షాప్…

13 hours ago