‘ఓజీ‘ మాదే అంటోన్న డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్

పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఓ పెద్ద పవర్ ఉంది. ఆన్ స్క్రీన్ పై పవర్ స్టార్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు. ఇక.. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్, స్టైల్స్ ను పర్ఫెక్ట్ గా ఆవిష్కరిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. ఇప్పుడు ‘ఓజీ‘ మూవీతో అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు డైరెక్టర్ సుజీత్. ‘ఆర్.ఆర్.ఆర్‘ వంటి గ్లోబల్ మూవీ తర్వాత డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ఇప్పటికే ‘ఓజీ‘ మూవీ కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే.. ఈ సినిమా డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మారుతుందనే న్యూస్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలను ఖండిస్తూ.. తాజాగా ఈ సినిమా నిర్మాణం విషయంలో క్లారిటీ ఇచ్చింది డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్.

‘ఓజీ‘ విషయంలో వస్తున్న రూమర్స్ ను నమ్మొద్దని.. ఈ సినిమా తమదే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘ఓజీ‘ పై తమకు ఫుల్ క్లారిటీ ఉందని.. ఈ సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ తెలిపింది. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts