‘గుంటూరు కారం’ ఈవెంట్ చీఫ్ గెస్ట్ అతనే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు గ్రాండ్ గా జరగబోతుంది. ఈ సినిమా నుంచి మోస్ట్ అవెయిటింగ్ ట్రైలర్ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈనేపథ్యంలో.. ‘గుంటూరు కారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ గ్రాండ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా సర్క్యులేట్ అవుతోంది.

ఇంచుమించు ఒకేసారి హీరోలుగా కెరీర్ ప్రారంభించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రెజెంట్ టాలీవుడ్ లోని స్టార్ హీరోస్ లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే సత్తా ఉన్న నటులు ఈ ఇద్దరూ. బయటకు కలిసి ఎక్కువగా కనిపించకపోయినా.. ఒకరికి సంబంధించిన విషయాల్లో మరొకరు అండగా నిలిచిన సందర్భాలున్నాయి. అప్పట్లో మహేష్ ‘అర్జున్’ సినిమాకి సంబంధించి పైరసీని అరికట్టే విషయంలో పవన్ ముందుకు వచ్చాడు. ఇక.. పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాకి వాయిస్ ఓవర్ అందించి మెగా ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేశాడు మహేష్.

ఈనేపథ్యంలోనే.. ఇప్పుడు సూపర్ స్టార్ ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతాడనే ప్రచారం జరుగుతుంది. మహేష్ తో పాటు.. ఈ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ పవన్ కి మంచి స్నేహం ఉంది. మరి.. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరు అనే విషయంలో ఏదైనా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

Related Posts