సుధీర్ బాబు ‘హరోం హర’ నుంచి కొత్త పాట

ఈరోజు (మే 11) సుధీర్ బాబు బర్త్ డే స్పెషల్ గా ‘హరోం హర’ నుంచి కొత్త పాట వచ్చింది. చైతన్ భరద్వాజ్ స్వరకల్పనలో సనాపాటి భరద్వాజ్ పాత్రుడు రాసిన ఈ గీతాన్ని రఘు కుంచె ఆలపించాడు. ఆద్యంతం చిత్తూరు స్లాంగ్ తో సాగిన ఈ గీతం వైవిధ్యంగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో సుధీర్ బాబు కి జోడీగా మాళవిక శర్మ నటిస్తుంది. మరో కీలక పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు. ఙ్ఞానశేఖర్ ద్వారక దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి.నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘హరోం హర’ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts