‘యాత్ర 2’ టీజర్.. అంచనాలు పెంచుతోన్న పొలిటికల్ బయోపిక్

టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ పొలిటికల్ బయోపిక్ ‘యాత్ర 2’ టీజర్ వచ్చేసింది. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రం రూపొందితే.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘యాత్ర 2’ రాబోతుంది. వై.ఎస్.ఆర్. మరణం.. ఆ తర్వాత జగన్ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు.. 2009 నుంచి 2019 వరకు ఏపీలో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ సినిమాని మహి.వి.రాఘవ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజయ్యింది.

టీజర్‌ ను గమనిస్తే.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వై.ఎస్.జగన్ రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. వై.ఎస్.ఆర్. మరణం తర్వాత జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర. ఆ యాత్రకు కలిగిన అడ్డంకులు వంటివి టీజర్ లో చూపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా.. టీజర్ అయితే ఇంప్రెస్సివ్ గా ఉంది. ఈ పొలిటికల్ బయోపిక్ పై అంచనాలు మరింత పెంచిందని చెప్పాలి. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గా మమ్ముట్టి, జగన్ గా జీవా నటిస్తుండగా.. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ కనిపించనున్నారు.

సంతోష్ నారాయణన్‌ సంగీతం, మది సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా ‘యాత్ర 2’కి మంచి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts