‘ఆయ్’ మూవీ నుంచి హీరోయిన్ ఇంట్రో గ్లింప్స్

డెబ్యూ మూవీ ‘మ్యాడ్’తో మంచి హిట్ అందుకున్న ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. ఇప్పుడు రెండో సినిమా ‘ఆయ్’తో రెడీ అవుతున్నాడు. తొలి చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేసిన నితిన్.. ఇప్పుడు తన రెండో చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థలో చేస్తున్నాడు. ఇప్పటికే ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకున్న ‘ఆయ్’ మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలయ్యాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి హీరోయిన్ నయన్ సారిక క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.

ఈ సినిమాలో ఫంక్ పల్లవి పాత్రలో కనిపించబోతుంది నయన్ సారిక. అచ్చమైన గోదావరి అమ్మాయిగా కనువిందు చేయనున్న నయన్.. ఫంక్ పల్లవి పాత్రలో గళ గళ మాట్లాడుతూ సందడి చేస్తోంది. కులమే మన బలం అంటూ ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. తమ కులపోళ్లు అందరూ అన్నింటా ముందుండాలనే తత్వం ఫంక్ పల్లవిది. ఈ గ్లింప్స్ లో ఆమె క్యారెక్టర్ ఇంట్రో ఆకట్టుకుంటుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకి అంజి కంచిపల్లి దర్శకుడు. ‘ఆయ్’ టైటిల్ కి.. ‘మేం ఫ్రెండ్సండి’ అనేది ట్యాగ్ లైన్. త్వరలో ‘ఆయ్’ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts