అఖండ కంటే ముందే మొదలుపెట్టిన సినిమా ‘గామి’ : నిర్మాత కార్తీక్‌ శబరీష్‌

తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదనేలా ప్రశంసలు దక్కించుకుంటోంది గామి. విశ్వక్‌సేన్ అఘోరా గా అద్భుతంగా నటించిన మూవీ ఇది. చాందినీ చౌదరి ఫిమేల్ లీడ్ చేసిన ఈ సినిమాను కార్తీక్ శబరీష్ విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా రిలీజయి మంచి రెస్పాన్స్‌ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సక్సెస్‌ఫుల్ గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కార్తీక్ శబరీష్ మీడియా మిత్రులతో ముచ్చటించారు.
కొత్త వారు సినిమా తీస్తే విడుదల చేయడమే పెద్ద సాహసం.. అలాంటిది గామి సినిమా విడుదలవడం.. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ రావడం ఆనందంగా ఉందన్నారు.


తమడ మీడియాలో షో ప్రొడ్యూసర్స్ గా ఉన్నపుడు చాలామంది ఎన్నారైలు పేరు చూసుకోవాలనే ఉద్దేశ్యంతో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్లన్నారు. అలాంటి వారందరినీ చేర్చి క్రౌడ్ ఫండ్ ఫార్ములాతో మను సినిమా తీసామన్నారు. ఇప్పుడు గామి కూడా అదే కాన్సెప్ట్‌లో చేసామన్నారు. విద్యాధర్‌తో చాలా షార్ట్‌ ఫిల్మ్స్ తీసిన అనుభవం ఉంది. అందుకే ఈ సినిమా కలిసి చేసామన్నారు.


ఈసినిమాలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా ఉంది. విద్యాధర్ కి గ్రాఫిక్స్‌ పై పట్టు ఉంది. ఈ సినిమాలో సింహం సీన్‌ ను గేమ్‌ ఆఫ్‌ థ్రోన్ వీఎఫ్‌ఎక్స్‌ చేసిన టీమ్‌ కి ఇచ్చామన్నారు. సింహం ఎపిసోడ్ వారికి వారితో చేయించి మిగతాది మన టీమ్‌కు అప్పగించడంతో 40 శాతం బడ్జెట్‌ తగ్గించగలిగామన్నారు.
క్రౌడ్ ఫండ్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా తక్కువ ఫండ్ వచ్చింది. దాంతో సినిమా తీయడం కష్టం. అలాగని ఆగిపోతే సినిమా చేయలేం. ముందుగా నా సొంతూరు నెల్లూరులో సులువుగా పర్మిషన్స్ దొరుకుతాయి కాబట్టి అక్కడ షూటింగ్ మొదలుపెట్టి షెడ్యూల్ కంప్లీట్ చేసామన్నారు. మా అనౌన్స్‌మెంట్ వీడియో చూసి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్ ఆఫీస్ కు వచ్చి వర్క్ చూసి ఓ బైట్ ఇచ్చారు. అలా ఇంకొంత మంది యాడ్ అయ్యే సరికి మిగతా షూట్‌ స్మూత్‌గా జరిగిందన్నారు.


విశ్వక్ మొదటి సినిమా ఇది. షూటింగ్ గ్యాప్ ఎక్కువ రావడం.. ఈలోగా విశ్వక్‌సేన్ మార్కెట్‌ పెరగడంతో దానికి తగ్గట్టే బడ్జెట్‌ పెంచుకుంటూ వచ్చాం.. ఈక్రమంలో వి సెల్యూలాయిడ్ వచ్చాక చాలా వరకు హెల్ప్ అయ్యిందన్నారు. గామిని ఓ రెండు సినిమాలతో పోల్చడం గమనించాను, నిజానికి ఆ సినిమాలు స్టార్ట్ కాకముందే ‘గామి’ని మొదలుపెట్టాం. క్లైమాక్స్ లో వచ్చే యూనిక్ పాయింట్ చాలా బావుంది. దర్శకుడు చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. అది నచ్చే సినిమా చేయాలని నిర్ణయించామన్నారు.
అప్‌కమింగ్ మూవీస్ గురించి చెప్తూ… మెగాస్టార్ విశ్వంబర సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేస్తున్నానన్నారు.

Related Posts