కేటీఆర్‌ లాంచ్‌ చేసిన ‘షరతులు వర్తిస్తాయి’ సాంగ్

స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజ‌ల్లు నిర్మించిన మూవీ ‘షరుతులు వర్తిస్తాయి’ . కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శక‌త్వం వహించారు. ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోందీ సినిమా. చైతర్య రావు, భూమిశెట్టి జంటగా నటించారు. ఈ సినిమా నుంచి ‘తురుమై వచ్చేయ్..’ లిరికల్ సాంగ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.


“ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా పోస్టర్స్, సాంగ్స్ చూపించారు. కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం. తెలంగాణ నేపథ్యంగా మరిన్ని సినిమాలు రావాలని ఆశిస్తున్నానన్నారు కేటీఆర్‌.
మా “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా నుంచి తురుమై వచ్చేయ్ లిరికల్ సాంగ్ ను కేటీఆర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ పాటకు సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు హీరో చైతన్యరావు.

బిజీగా ఉన్నా కేటీఆర్ గారు మాకు టైమ్ ఇచ్చారు. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా నుంచి తురుమై వచ్చేయ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆయనకు మా మూవీ టీమ్ తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. సమస్యలకు భయపడకుండా ఎదిరించి నిలవాలనే స్ఫూర్తిని అందించేలా ఈ పాటను రూపొందించాం. మా సినిమాలో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అన్నారు దర్శకుడు కుమార స్వామి.

Related Posts