లైన్‌ మెన్ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

హీరో త్రిగుణ్ చేస్తున్న లేటెస్ట్‌ మూవీ లైన్‌మెన్‌. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందింది. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకి వి. రఘుశాస్త్రి డైరెక్షన్‌ చేసారు. మార్చి 15 న గ్రాండ్ రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కు శివ కందుకూరి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ ఈవెంట్‌లో రియల్‌ లైన్‌మెన్‌లను సత్కరించడం విశేషం.


ఈ సినిమా చాలా నిజాయితీతో తీసారనిపిస్తుంది. పోస్టర్స్ చూస్తుంటే మన మూలాలను మరవకుండా తీసిన సినిమా అనిపిస్తోందన్నారు శివ కందుకూరి. త్రిగుణ్ తన చుట్టూ ఉన్నవారికి కంఫర్ట్‌గా ఉంచే ప్రయత్నం చేస్తుంటాడు.. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి….మార్చి 15 న రిలీజ్‌ కాబోతున్న లైన్‌మెన్ సినిమాని ధియేటర్లో తప్పక చూసి ఆదరించండని కోరారు శివ కందుకూరి. ఈ చిత్ర యూనిట్‌ని మెచ్చుకున్నారు.


గతంలో చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా చేసాను. ఆ సినిమాలో అన్నీ బూతులే ఉన్నాయి.. డబ్బులు బాగా వచ్చాయి.. కానీ లైన్‌మెన్ లాంటి సినిమాలు తీస్తే రాత్రి తృప్తిగా నిద్రపడుతుంది.. అంత మంచి సినిమా అన్నారు హీరో త్రిగుణ్. తినే ప్రతీ మెతుకు మీద తినేవాడి పేరున్నట్టే చేసే పాత్ర మీద చేసేవాడి పేరుంటుంది.. మన స్థాయిని పెంచే సినిమాలు తీయాలనుకుంటున్నానన్నారు త్రిగుణ్. లేడీస్ లైన్ ఉమెన్‌గా రావడం చూసి.. ఈ సినిమాను చేయాలని అనుకున్నానన్నారు. లైన్ మెన్‌లు చేస్తున్న సేవలను ఎవ్వరూ గుర్తించడం లేదు.ఇప్పుడు సినిమాలకు భాషా సరిహద్దుల్లేవు.తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేశాను. ప్రకాష్ రాజ్ గారు నా మొదటి సినిమాను నిర్మించారు. ఆయనలా అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంటుంది. నా కోరిక తీర్చిన నా నిర్మాతలకు థాంక్స్ అన్నారు త్రిగుణ్.
మిగతా అతిధులు, చిత్ర యూనిట్ ఈ చిత్ర విజయాన్ని కాంక్షించారు.
ఈ ఈవెంట్‌ లో శివ కందుకూరి బిగ్‌ టిక్కెట్‌ లాంచ్‌ చేసారు.

Related Posts