కాకినాడలో క్లైమాక్స్ చిత్రీకరణలో ‘టిల్లు స్క్వేర్’

ఈనెలలో రాబోతున్న క్రేజీ మూవీస్ లో ‘టిల్లు స్క్వేర్’ ఒకటి. సూపర్ హిట్ ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా స్టార్ బాయ్ సిద్ధు నటించిన చిత్రమిది. ఇప్పటికే సినిమా అంతా ఫినిష్ అయినా.. కొంచెం ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉందట. ఆ వర్క్ ను కాకినాడ పోర్ట్ లో చిత్రీకరిస్తున్నారట. ఈ సీన్స్.. ‘టిల్లు స్క్వేర్’ క్లైమాక్స్ ఎపిసోడ్ కు సంబంధించిన మ్యాచింగ్ సన్నివేశాలు అని తెలుస్తోంది.

‘డీజే టిల్లు’ తరహాలోనే వినోదాత్మకంగా, టిల్లు శైలి సంభాషణలతో సీక్వెల్ కూడా సాగనుందని ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో అర్థమయ్యింది. ఈ సినిమాలో సిద్ధుకి దీటైన పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతుంది. ఇప్పటివరకూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో మెరిసిన అనుపమ.. ఈ మూవీలో తన బోల్డ్ అవతార్ ని ఆవిష్కరించబోతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’ మార్చి 29న థియేటర్లలోకి వస్తోంది.

Related Posts