ట్రైలర్ టాక్.. ఆద్యంతం నవ్వులు పంచే ‘డంకీ‘

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ లేటెస్ట్ మూవీ ‘డంకీ‘. డిసెంబర్ 21న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘డంకీ‘ ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి డంకీ డ్రాప్స్ పేరుతో కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు. లేటెస్ట్ గా ‘డంకీ డ్రాప్ 4‘ వచ్చేసింది. మోస్ట్ అవైటింగ్ ‘డంకీ‘ ట్రైలర్ ను డ్రాప్ 4 గా వదిలారు.

ట్రైలర్ విషయానికొస్తే.. హార్డి అనే పాత్రలో షారూక్ నటిస్తున్నాడు. ట్రైన్‌ లో తను పుట్టి పెరిగిన పంజాబ్ లోని ఓ ప్రాంతానికి వస్తాడు షారుక్. అక్కడ తన స్నేహితులైన మను, సుఖి, బుగ్గు, బల్లి లండన్ వెళ్లడానికి తమ తమ ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కుస్తీ పడుతుంటారు. అయినా.. వాళ్ల వల్ల కాదు. దీంతో షారుక్ తో పాటుగా మిగతా నలుగురు స్నేహితులు ఎలాంటి అనుమతులు లేకుండా బోర్డర్స్ దాటి లండన్ లోకి ప్రవేశించాలని నిర్ణయించుకోవడం.. ఆ క్రమంలో వాళ్లు ఎలాంటి ఆపదలు ఎదుర్కొన్నారు వంటివి ఈ ట్రైలర్ లో కనిపించాయి. మొత్తంగా.. రాజ్ కుమార్ హిరాణి మార్క్ ఎమోషన్స్, కామెడీతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Related Posts