రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్?

‘గేమ్ ఛేంజర్‘ మూవీతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం చరణ్-బుచ్చిబాబు సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, వెంకట్ సతీష్ కిలారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహమాన్ పనిచేయబోతున్నట్టు హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా నటించనున్నాడట.

లేటెస్ట్ గా ఈ మూవీలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుందనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు రామ్ చరణ్, జాన్వీ కపూర్ లతో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ సీక్వెల్ తెరకెక్కిస్తానని గతంలో నిర్మాత అశ్వనీదత్ అన్నారు. అయితే.. జాన్వీ ఎంట్రీ ఆల్రెడీ ‘దేవర‘తో జరుగుతోంది. ఇప్పుడు చరణ్ తో తెలుగులో తన సెకండ్ మూవీ చేయడానికి సిద్ధమవుతోందట జాన్వీ. మరి.. త్వరలోనే చరణ్-బుచ్చిబాబు మూవీలో జాన్వీ ఎంట్రీపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Related Posts