ఇండియాస్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ మూవీ ‘ఫైటర్‘

హీరో అనే పదానికి అసలు సిసలు నిర్వచనంలా ఉంటాడు గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్. ప్రస్తుతం బీటౌన్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోస్ లో హృతిక్ ఒకడు. ‘సూపర్ 30, వార్, విక్రమ్ వేద‘ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఇప్పుడు ‘ఫైటర్‘ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇండియాస్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ మూవీగా ‘ఫైటర్‘ రూపొందుతోంది. ఇప్పటికే హృతిక్ రోషన్ కి ‘బ్యాంగ్ బ్యాంగ్, వార్‘ వంటి హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్స్ అందించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ హృతిక్, దీపిక జంటగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలో అనిల్ కపూర్ కనిపించబోతున్నాడు. 2024, జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో స్క్వాడ్రాన్ లీడర్ షంషేర్ పఠానియా గా హృతిక్ కనిపించబోతున్నాడు. అతని కాల్ సైన్ నేమ్ ప్యాటీ. ఎయిర్ డ్రాగన్స్ యూనిట్ లో పనిచేసే ఫైటర్ పైలట్ ఇతను. హీరోయిన్ దీపిక కూడా పైలట్ గా కనిపించనుందట. ఎయిర్ లో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ ‘ఫైటర్‘ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయంటున్నారు. ‘ఫైటర్‘ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో ‘వార్ 2‘లో జాయిన్ కానున్నాడు హృతిక్.

Related Posts