బర్త్ డే లుక్ తో భయపెడుతున్న బాబీ డియోల్

విలక్షణ నటుడు సూర్య మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ‘. శివ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య యుద్ధ వీరుడిగానూ, ట్రెండీ లుక్ లోనూ రెండు కాలాలకు సంబంధించిన పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో యుద్ధ వీరుడిగా సూర్య ఎంత భయంకరంగా ఉంటాడో ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ లో చూశాం.

లేటెస్ట్ గా సూర్యకి దీటైన విలన్ గా కనిపించబోయే విలన్ పాత్రధారి అయిన బాబీ డియోల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈరోజు (జనవరి 27) బాబీ డియోల్ బర్త్ డే స్పెషల్ గా ఈ పోస్టర్ రిలీజయ్యింది. ఈ పోస్టర్ లో బాబీ డియోల్ అతి భయంకరంగా కనిపిస్తున్నాడు. ఓ తెగకు సంబంధించిన నాయకుడి పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘యానిమల్‘తో విలన్ గా అదరగొట్టిన బాబీ డియోల్.. ‘కంగువ‘తో ఏ రేంజులో భయపెడతాడో చూడాలి.

Related Posts