మాసివ్ ఫోర్సెస్ క్రేజీ కాంబోలో హీరో ఎవరు?

మాసివ్ ఫోర్సెస్ స్టార్మింగ్ ఒన్స్ అగైన్ అంటూ.. బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయ‌పాటి శ్రీ‌ను, అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ కల‌యిక‌లో భారీ ప్రాజెక్ట్ అని ఓ అధికారిక ప్రకటన వచ్చింది. 2016లో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సరైనోడు‘ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ తర్వాత మళ్లీ అల్లు అరవింద్-బోయపాటి శ్రీను కలయికలో రూపొందబోతున్న సినిమా ఇది.

అద్భుత‌మైన మాస్‌ మేకింగ్ స్కిల్స్ తో సినిమాలు తెర‌కెక్కించి మాస్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బోయ‌పాటి శ్రీ‌ను, వైవిధ్యమైన వాణిజ్య క‌థాంశాల‌ను అత్యున్నత‌మైన నిర్మాణ విలువ‌ల‌తో నిర్మించి ఎన్నో అఖండ విజ‌యాలు సొంతం చేసుకున్న గొప్ప నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కలయికలో సినిమా ఓ.కె.. కానీ.. అసలు ఈ చిత్రంలో నటించే హీరో ఎవరనేదే? ఆసక్తికరంగా మారింది. మరోసారి ‘సరైనోడు‘ అల్లు అర్జున్ తోనే ఈ సినిమా తెరకెక్కించబోతున్నారా? లేదా నటసింహం బాలకృష్ణతో అల్లు అరవింద్ చేయాలనుకుంటోన్న సినిమా ఇదేనా? అనేది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.

Related Posts