వెంకటేష్ తో అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కాంబో

విక్టరీ వెంకటేష్ లోని ఫన్ యాంగిల్ ను అత్యద్భుతంగా ఉపయోగించుకున్న ఈతరం దర్శకుల్లో అనిల్ రావిపూడి ముందు వరుసలో నిలుస్తాడు. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి ఫన్ ఎంటర్ టైనర్స్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి వెంకటేష్ కోసం పల్లెటూరి, పట్నం బ్యాక్ డ్రాప్ లో ఓ యూనిక్ పాయింట్ తో ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించడానికి స్టోరీ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

వెంకటేష్ తో అనిల్ రావిపూడికి ఇది హ్యాట్రిక్ కాంబో అయితే.. నిర్మాత దిల్ రాజు తో డబుల్ హ్యాట్రిక్ కాంబినేషన్. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో ‘సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3’ వంటి సినిమాలందించాడు అనిల్. ఇప్పుడు వెంకటేష్ చిత్రంతో దిల్ రాజు నిర్మాణంలో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టినట్టే. మొత్తంమీద.. టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుడిగా ఖ్యాతి గడించిన అనిల్ రావిపూడి.. వెంకీతో మరో సూపర్ హిట్ అందించడం ఖాయమనే అనుకోవచ్చు.

Related Posts