శేఖర్-రానా కాంబోలో ‘లీడర్ 2’?

దగ్గుబాటి రానా ని హీరోగా పరిచయం చేసిన చిత్రం ‘లీడర్’. అప్పటివరకూ లవ్ స్టోరీస్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన శేఖర్ కమ్ముల తీసిన పొలిటికల్ డ్రామా ఇది. రాజకీయాలు, రాజకీయ నాయకుల గురించి మంచి సందేశాన్నందించిన చిత్రంగా ‘లీడర్’ ఎప్పటికీ మిగిలిపోతుంది. 2010లో వచ్చిన ఈ సినిమా ద్వారానే రానా హీరోగా పరిచయమయ్యాడు. ఇప్పుడు ‘లీడర్’కి సీక్వెల్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయట.

రానా కోసం మరోసారి ఓ పొలిటికల్ డ్రామాని రెడీ చేస్తున్నాడట శేఖర్ కమ్ముల. ‘లీడర్’ స్టైల్ లో సాగే ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని ‘లీడర్’కి సీక్వెల్ గా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ క్రేజీ సీక్వెల్ కి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల.. నాగ్-ధనుష్ మల్టీస్టారర్ తో బిజీగా ఉంటే.. రానా, తేజ డైరెక్షన్ లో ‘రాక్షస రాజా’ చేస్తున్నాడు. మరి.. త్వరలోనే ‘లీడర్ 2’పై ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుందేమో చూడాలి.

Related Posts