నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ తెస్తోన్న రైటర్

కటౌట్ ఉన్నవాడికి కంటెంట్ తక్కువగా ఉన్నా కమర్షియల్ గా మరీ లాస్ లు రావు. ఇక కంటెంట్ బలంగా ఉన్నోడికి కటౌట్ లేకుంటే ఖచ్చితంగా కాసులు రాలతాయి. ఈ విషయం ఇప్పటికే చాలా చిన్న సినిమాలు ప్రూవ్ చేశాయి. లేటెస్ట్ గా వచ్చిన మరో సినిమా కూడా నిరూపించింది. బలమైన తారాగణం లేదు. పెద్ద బ్యానర్ కాదు. ఇతర కాస్టింగ్ సైతం స్టార్స్ కాదు. అంతెందుకు టెక్నీషియన్స్ సైతం మీడియం రేంజ్‌ వారే. అయినా సినిమాను చాలా జాగ్రత్తగా ప్రమోట్ చేసుకున్నారు.. పక్కా హిట్ అందుకున్నారు. ఎంత అంటే పెట్టుబడికి డబుల్ లాభాలు తెస్తోందీ చిత్రం. మరి ఆ చిన్న సినిమా రైటర్ పద్మభూషణ్.


షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు వచ్చి.. అతి తక్కువ టైమ్ లోనే నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు సుహాస్. ఫ్రెండ్ గా, ఇతర పాత్రల్లోనూ సత్తా చాటుతూ.. తనదైన దారిలో దూసుకుపోతున్నాడు. టాలెంటెడ్ అని షార్ట్ ఫిల్మ్స్ లోనే అనిపించుకున్నాడు కాబట్టి.. వెండితెరపైనా ఎలాంటి పాత్రైనా అలవోకగా ఆకట్టుకుంటున్నాడు. ఆ మధ్య వచ్చి హిట్ 2 మూవీలో విలన్ గా అదరగొట్టాడు. అంతకు ముందు కరోనా టైమ్లో వచ్చిన కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. కానీ ఈ చిత్రం కేవలం ఓటిటిల్లోనే రావడంతో అతని టాలెంట్ అంతగా తెలియలేదు. హీరోగానూ రాణించగలను అని కలర్ ఫోటోతోనే నిరూపించుకున్నాడు.

అలాగని రెగ్యులర్ హీరో కాదు.. ఒకప్పుడు మనకు చంద్రమోహన్, మురళీ మోహన్ వంటి వారు తీసిన తరహా చిత్రాలకు బాగా సూట్ అవుతాడు. పైగా తన కలర్ పైనా సెటైర్స్ ఉన్నా ఇబ్బంది లేదంటున్నాడు. సో.. అతను హీరోగా కొత్తగా వస్తోన్న కుర్రాళ్లు కథలు రాసుకోవడంలో ఆశ్చర్యమేం ఉంది. అలా వచ్చిందే రైటర్ పద్మభూషణ్. షన్ముఖ్ ప్రశాంత్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని ముందు నుంచీ చాలా జాగ్రత్తగా ప్రమోషన్స్ చేశారు. రిలీజ్ కు ముందే రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన నగరాల్లో ఫ్రీ షోస్ వేశారు.

టాక్ బయటకు వచ్చింది. అలా చూసిన వారంతా బావుందన్నారు. కంప్లీట్ మిడిల్ క్లాస్ డ్రామాగా మెప్పిచింది. అసలే ఈ మధ్య హీరోలంటే ఓ పేద్ద పేలస్ లు, ఫారెన్స్ లోనే ఉంటున్న టైమ్ కదా. అందుకే ఈ మిడిల్ క్లాస్ కథకు చాలామంది కనెక్ట్ అయ్యారు. కట్ చేస్తే సినిమా థియేటర్స్ లోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఓవర్శీస్ లో ఊహించని వసూళ్లు సాధిస్తోంది.

ఇంతా చేస్తే ఈ మూవీలో సుహాస్ తో పాటు క్రౌడ్ పుల్లర్ ఆర్టిస్టులు లేరు. రోహిణి, ఆశిష్‌ విద్యార్థి కీలక పాత్రలు చేశారు. టీనా శిల్పరాజ్ హీరోయిన్ గా నటిస్తే.. సెకండ్ హాఫ్‌ లో వచ్చే గౌరీ పాత్ర సర్ ప్రైజ్ చేస్తుంది. మొత్తంగా కంటెంట్ ఉంటేనే కాదు.. కాస్త ప్రమోషన్స్ కూడా చేసుకోగలిగితే ఇలాంటి చిన్న సినిమాలకు ఇంకా కాలం చెల్లిపోలేదని రైటర్ పద్మభూషణ్ ప్రూవ్ చేస్తున్నాడు.

Telugu 70mm

Recent Posts

భయపెట్టడానికి వస్తోన్న భరత్ ‘మిరల్’

'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నటించిన హారర్ థ్రిల్లర్ 'మిరల్'. 'స్కేర్' అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. భరత్ కి…

1 hour ago

‘దేవకి నందన వాసుదేవ’ నుంచి రొమాంటిక్ మెలోడీ

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న రెండో చిత్రం 'దేవకి నందన వాసుదేవ'. తొలి సినిమా…

1 hour ago

మే 10న విడుదలకు ముస్తాబవుతోన్న ‘సత్య‘

సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా పరిచయమవుతోన్న చిత్రం ‘సత్య‘. ‘ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది..…

20 hours ago

‘కన్నప్ప‘లో అక్షయ్ కుమార్ పోర్షన్ కంప్లీట్

విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ…

20 hours ago

‘బాక్‘ సినిమా రివ్యూ

నటీనటులు: సుందర్.సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ తదితరులుసినిమాటోగ్రఫి: ఈ కృష్ణసామిసంగీతం: హిప్ హాప్…

20 hours ago

ఆ… ఒక్కటీ అడక్కు‘ సినిమా రివ్యూ

నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ,…

21 hours ago