థియేటర్ సినిమాకోసం రెమ్యూనరేషన్ లేకుండా ప్రభాస్

ప్రభాస్ తో సినిమా అంటే మాటలా.. కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి. కోరినంత సెట్స్ వేయాలి. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అంటూ అంతర్జాతీయ స్థాయిలో ఖర్చులు పెట్టించాలి. మరి అవేవీ లేకుండా సింపుల్ గా ప్రభాస్ తో సినిమా చేయడం సాధ్యం అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు అనే అంటారు ఎవరైనా. బట్ సాధ్యమే అని లేటెస్ట్ గా ఓ మూవీ ప్రూవ్ చేస్తోంది. అది కూడా ఓ చిన్న సినిమా. యస్.. ప్రభాస్ తో సినిమా అంటేనే చిన్నది అనే మాటే వినిపించదు. అలాంటిది అసలు బడ్జెట్టే లేకుండా చేయడం అంటే అదో మిరాకిల్ అనే కదా అంటాం. యస్.. ఆ మిరాకిల్ నిజంగానే జరుగుతోందిప్పుడు.


ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తే చాలు.. ఎన్ని కోట్ల బడ్జెట్ అయినా ఏ మాత్రం లెక్క చేయకుండా కుమ్మరించేందుకు ఎంతోమంది నిర్మాతలు లైన్ లో ఉన్నారు. బాహుబలి తర్వాత అతని రేంజ్ ఎలా మారిందో అందరికీ తెలుసు. పైగా సాహో, రాధేశ్యామ్ పోయినా ఆ క్రేజ్ తగ్గలేదు. నిజానికి సాహో వల్ల నిర్మాతలు లాస్ కాలేదు కానీ.. రాధేశ్యామ్ మాత్రం చాలా నష్టాలే తెచ్చింది.

అయినా ప్రభాస్ కోసం ఎంత బడ్జెట్ పెట్టేందుకైనా నిర్మాతలు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే అంటూ అత్యంత భారీ బడ్జెట్ మూవీస్ చేస్తున్నాడు. ఈ రెండూ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ స్టాండర్డ్స్ లోనే తీస్తోన్న చిత్రాలు కావడం విశేషం. మరి ఇలాంటి ప్రభాస్ తో అసలు బడ్జెట్ లేకుండా సినిమా చేయడం సాధ్యమా అంటే సాధ్యమే అని ప్రూవ్ చేస్తున్నాడు దర్శకుడు మారుతి. యస్.. ఈ రెండు భారీ సినిమాల మధ్య మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోన్న ఈచిత్రం ఇది.

ఈ బ్యానర్ లో సినిమా అంటే బడ్జెట్ ఎప్పుడు పరిమితుల్లోనే ఉంటుంది. మరి ప్రభాస్ తో అంటే భారీగా ఉండాలి కదా.. అనుకున్నారు. కానీ అవేవీ లేకుండా కేవలం ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా సినిమాను రిచ్ గా తీస్తున్నారట. మిగతా బడ్జెట్ అంతా చాలా కంట్రోల్ లోనే ఉంటుందని సమాచారం. ఇంకా చెబితే ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రభాస్ తో పాటు మారుతి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఈ రెండు చాలు కదా.. ఈ మూవీ ఎంత తక్కువ బడ్జెట్ లో రూపొందుతుందో తెలియడానికి. వీరితో పాటు మరికొందరు ఆర్టిస్టులు కూడా లాభాల్లో వాటా అనే ప్రాతిపదికనే ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడని నిర్మాతలు ప్రభాస్ కోసం ఉన్న టైమ్ లో అతను చేస్తోన్న ఈ సినిమాతో పాటు చిత్ర బడ్జెట్ కూడా చాలా హాట్ టాపిక్ అయిపోయిందిప్పుడు. మరి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ప్రభాస్ గతంలో ఏదైనా మాట ఇచ్చాడా లేక ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నాడా అనేది చెప్పలేం కానీ.. మిగతా టాప్ స్టార్స్ కూడా డార్లింగ్ లాగే ఆలోచిస్తే ఖచ్చితంగా టాలీవుడ్ కు ముఖ్యంగా నిర్మాతలకు మరింత మంచి రోజులు వస్తాయని చెప్పొచ్చు.

Telugu 70mm

Recent Posts

NTR-Prasanth Neel project from November?

The NTR-Prasanth Neel project is one of the upcoming crazy movies from the Indian film…

2 hours ago

యానిమేషన్ రూపంలో ‘బాహుబలి.. క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’

దర్శకధీరుడు రాజమౌళి సృష్టి 'బాహుబలి' సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ లో వచ్చిన 'బాహుబలి 1,…

3 hours ago

ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తిన అనుపమ్ ఖేర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. బాలీవుడ్ సెలబ్రిటీస్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు. 'వార్ 2' కోసం ముంబైలో విహరిస్తున్న తారక్..…

3 hours ago

కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

ప్రత్యేకమైన రోజులను పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు (మే 1) కార్మిక…

4 hours ago

Mrunal thinks.. Mehreen showed it

While maintaining their career on the one hand, on the other hand they are also…

6 hours ago