ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ విజయ్ కి వస్తుందా..

ప్యాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ కు ఇప్పుడు ఏ రేంజ్ ఇమేజ్ ఉందో అందరికీ తెలుసు. ఆ తర్వాత సౌత్ నుంచి కెజీఎఫ్‌ తో సత్తా చాటినా.. యశ్ కు అదే స్థానం వస్తుందని అనుకోలేం. ఇప్పటి వరకూ యశ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పలేకపోయాడు. మరోవైపు దుల్కర్ సాల్మన్ సత్తా చాటుతున్నా.. అతను ప్రభాస్ రేంజ్ కు కాదు.. దరిదాపుల్లోకి కూడా వెళ్లలేడు అనేది నిజం. ఎందుకంటే అతనివి సాఫ్ట్ నేచర్ ఉన్న సినిమాలు. తన నటనా అదే ఎలివేట్ చేస్తుంది. సో.. మాస్ హీరోగా ఆ స్థాయికి అతను వెళ్లలేడు. ఇక తెలుగు నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ లకు ఆ స్టామినా ఉంది. బట్ వీరి తర్వాతి సినిమాలు రిలీజ్ అయితే కానీ రేంజ్ గురించి చెప్పలేం. ఒకవేళ నెక్ట్స్ మూవీస్ కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ అయితే.. ఇండియన్ బాక్సాఫీస్ కు హైదరాబాదే అడ్డా అవుతుందనేది నిజం. అయితే లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ సౌత్ వ్యాప్తంగా రన్ అవుతోంది.ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ కు వెళ్లే స్టామినా తమిళ్ స్టార్ ఇళయదళపతి విజయ్ కి ఉంది అని. నిజానికి విజయ్ నటన మొన్నటి వరకూ కేవలం తమిళ్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమై చాలా ఓవర్ యాక్టింగ్ తో కనిపించేది. కొన్నాల్లుగా మారాడు. ముఖ్యంగా తుపాకి సినిమా నుంచి మధ్యలో రెండు మూడు సినిమాల్లో మళ్లీ తమిళ్ అతి కనిపించినా..

రీసెంట్ మూవీస్ లో అవేం లేవు. అందుకని అతను ప్రభాస్ తర్వాతి స్థానానికి వెళతాడు అంటాం అనుకున్నారేమో. అదేం కాదు. ఇంకా చెబితే ఆ రేంజ్ అతని వల్ల కాదు.. అతని దర్శకుల వల్ల వచ్చే అవకాశం కనిపిస్తోంది.తమిళ్ లో కొందరు దర్శకులు విజయ్ ని ఆరాధిస్తారు. అందులో అట్లీ ఒకడు. మరీ ఆరాధన అని చెప్పలేం కానీ విపరీతంగా అభిమానించే మరో దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ ఇద్దరూ ఇప్పుడు సౌత్ తో పాటు ఇండియన్ సినిమాను మార్చే దమ్మున్న దర్శకులుగా కనిపిస్తున్నారు. లోకేష్ విక్రమ్ తో ఏ రేంజ్ లో రచ్చ చేశాడో అందరికీ తెలుసు. అట్లీ వరుసగా విజయ్ తో చేసిన మూడు సినిమాలతో అతనికి తమిళ్ ను దాటి మాగ్జిమం మార్కెట్ ను క్రియేట్ చేశాడు అనడంలో ఏ డౌట్ లేదు. ఈ ఇద్దరే ఇప్పుడు విజయ్ ని ప్రభాస్ తర్వాతి స్థానంలో నిలబెడతారు అంటున్నారు. మరి అదెలా అంటారా..?ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం వరుస డిజాస్టర్స్ లో ఉన్న షారుఖ్ కు ఈ మూవీతో ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఏకంగా 200 కోట్ల నాన్ థియేట్రికల్ మార్కెట్ జరిగింది అని వినిపిస్తోంది. అంటే ఈ మూవీ బడ్జెట్ అంతా రికవర్ అయినట్టే.

ఇక థియేట్రికల్ గా మరో మూడు వందల వరకూ మార్కెట్ కావొచ్చు అంటున్నారు. అయితే ఇదంతా షారుఖ్ తో పాటు అట్లీ కూడా ఉండటం వల్లే అవుతోన్న బిజినెస్ అనేది కాదనలేని సత్యం. అలాంటి అట్లీ నెక్ట్స్ మూవీ విజయ్ తో ఉంది. జవాన్ ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే అట్లీ క్రేజ్ మామూలుగా ఉండదు. అది విజయ్ ని ప్యాన్ ఇండియన్ స్థాయిలో సినిమాకంటే ముందే ఫేమ్ చేస్తుంది.అలాగే లోకేష్ కూడా.. ప్రస్తుతం విక్రమ్ లేదా ఖైదీకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు లోకేష్‌. ఇతని తర్వాతి సినిమా కూడా విజయ్ తోనే. లోకేష్‌ ఇప్పుడు చేస్తోన్న సినిమా కూడా విక్రమ్ లా సంచలన విజయం సాధిస్తే.. అప్పటికే విజయ్ – అట్లీ కాంబో బ్లాక్ బస్టర్ కొట్టి ఉంటే ఖచ్చితంగా విజయ్ మార్కెట్ రేంజ్ 700 -1000 కోట్ల వరకూ వెళుతుందని సింపుల్ గా ఊహించేయొచ్చు. అలా విజయ్ కూడా ప్రభాస్ తర్వాతి స్థానం లేదా ముందే చెప్పుకున్నట్టు అప్పటికే మనవాళ్లు జెండా ఎగరేసి ఉంటే ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ సరసన చేరొచ్చు.

Related Posts