ప్రేమలు అనేకం అనేదే “లాట్స్ ఆఫ్ లవ్” దర్శక నిర్మాత- విశ్వానంద్ పటార్

ఎస్ ఎమ్ ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీమతి అనిత, ప్రఖ్యాత్ సమర్పణలో ప్రణవి పిక్చర్స్ పతాకంపై డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం “లాట్స్ ఆఫ్ లవ్” ఈ నెల 30 న తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత అయినటువంటి డా. విశ్వానంద్ పటార్ ఈ సినిమా అనుభవాలతో పాటు సొంత విశేషాలను మీడియా విలేకరులతో తో పంచుకుంటూ…


నా పేరు విశ్వానంద్ పటార్ పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే…. మ్యానేజ్ మెంట్ లో పి హెచ్ డి చేసాను.. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేనప్పటికీ చిన్నప్పటి నుంచి ఫిలిమ్స్ పై ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది. ఈనెల 30న విడుదల కాబోతున్న “లాట్స్ ఆఫ్ లవ్ ” చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించాను. ఈ సినిమాకు దర్శకత్వం తో పాటు కథ, మాటలు, మ్యూజిక్ నిర్మాతగా నేనే వ్యవహరించడం వెనుక కారణం ఉంది. మొట్ట మొదటి సినిమా కావడంతో కాస్త బడ్జెట్ కంట్రోల్ పెట్టడంతో పాటు 24 క్రాఫ్ట్ పై అవగాహన ఉండడం వల్లే అన్నీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నా స్నేహితులు కిరణ్, శ్రీనివాస్ లు కూడా నాకు చాలా సపోర్ట్ అందించారు. ఒకరకంగా చెప్పాలంటే వారు లేకపోతే ఈ సినిమా విడుదల దాకా వచ్చేది కాదు. ఏమైనా ఇన్నీ భాద్యతలతో ఒక సినిమా ను విడుదల వరకు తీసుకు రావడం అనేది అంత ఈజీ కాదని అర్థమయ్యింది. ఇక ఈ సినిమాలో నాతో సహా అందరూ కొత్తవారే డాక్టర్ ప�