ఇంతకీ పూరీ ఎందుకు రాలేదు..?

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్న మేటర్ బండ్ల గణేష్‌ చేసిన సెన్సేషనల్ కమెంట్సే. జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అతను మూడు అంశాలను గురించి స్పష్టంగా చెప్పాడు. ఒకటి పూరీ రాకపోవడాన్ని హైలెట్ చేశాడు. మనం ఏం చేసినా పిల్లల కోసం, పెళ్లాం కోసమే అని ఘాటుగానే అన్నాడు. తర్వాత ‘ర్యాంప్ లు వ్యాంప్ లు వస్తుంటారు పోతుంటారు” అనే మాట మరో హైలెట్ అయింది. దీంతో ఇన్నాళ్లూ పూరీ అండ్ వైఫ్‌ మధ్య ఉన్న ఎడబాటు వెనక ‘ఎవరో’వ్యాంప్ ఉన్నారన్నది ఆల్మోస్ట్ తేలిపోయింది. ఇక మూడోది పూరీ వల్ల లైఫ్ అందుకున్న హీరోలెవరూ ఈ ఫంక్షన్ కి రాలేదు అని.. ? పూరీ లైఫ్ ఇచ్చాడు అని చెప్పడం ఎంతైనా పూర్తిగా ఒప్పుకునే మాట కాదు. ఆ విజయాలు పూరీకీ అవసరమే కదా..? తను హిట్ మూవీ తీశాడు. ఆ సినిమాల్లో వాళ్లు నటించారు. కేవలం హిట్ మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్లే రావాలా.. ఫ్లాప్ మూవీస్ చేసిన హీరోలకు ఛాన్స్ లేదా అనే మరో ప్రశ్నా వస్తుంది. ఎందుకంటే పూరీ జగన్నాథ్ ఓ దర్శకుడు కాబట్టి.. జయాపజయాలు అతని ఖాతాలోనే ఉంటాయి కాబట్టి.. అదే టైమ్ లో “కన్నతండ్రే రాలేదు ఇంక హీరోలెందుకు వస్తారు”.. అనే ప్రశ్నలు కూడా తిరిగి వినిపిస్తాయి.

ఇక ర్యాంప్ లు వ్యాంప్ లు.. ఈ మాట పూర్తిగా కొందరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి. కాబట్టి మనకనవసరం. అయితే బండ్ల గణేష్ చేసిన కమెంట్స్ గురించి పక్కన బెడితే అసలు పూరీ ఎందుకు రాలేదు..? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు..? అంటే పూరీయే చెప్పాలి.. కానీ అతను పాడ్ కాస్ట్ లలో ఇతరులకు నీతులు చెబుతాడు తప్ప తను పాటించడు కదా..? అంచేత అతన్నుంచి ప్రాపర్ ఆన్సర్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేయలేం.ఒకవేళ పూరీ రాకపోవడానికి కారణం అతను ఇప్పుడు చేస్తోన్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీ అనుకోవడానికీ లేదు. అతను కావాలనుకుంటే ఒక రోజు షూటింగ్ ఆగిపోవడం పెద్ద విషయమేం కాదు. కాదూ ఒకవేళ తను వస్తే కొడుకు సినిమా ఆడటం లేదు అనే ఏదైనా సెంటిమెంట్ ఆపిందా అంటే అలాంటివి అతను నమ్మడు. అసలు ఇవన్నీ కాదు.. ఏదో “శక్తి” అతన్ని ఆపింది అనేది బలంగా వినిపిస్తోన్న మాట. ఆ శక్తి అతని పక్కనే నిత్యం ఉంటుంది. నిజానికి పూరీ తన భార్య గురించి కొన్నాళ్లుగా ఎన్ని చెప్పినా జనం నమ్మడం మానేశారు. పైగా ఒకప్పటిలా ఇద్దరూ కలిసి కనిపించడం కూడా తగ్గింది. ఎప్పుడైనా ఫోటోస్ పెడిత అవి పాతవే అని ఎవరికైనా సులువుగానే అర్థం అవుతుంది. ఏతావాతా పూరీకేం సమస్య లేదు. కానీ ఇలా నలుగురిలో తన కుటుంబం కాని వ్యక్తి మాటల వల్ల అభాసుపాలవుతాడు.

Related Posts