Advertisement
కూతురు కోసం సీనియర్ హీరో ఆరాటం..
Movies Tollywood

కూతురు కోసం సీనియర్ హీరో ఆరాటం..

Advertisement

కూతురు కొడుకులను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి ఆయా స్టార్ హీరోలు ఎన్ని తంటాలు పడ్డారో, పడుతున్నారో అన్ని పరిశ్రమల్లోనూ చూస్తూనే ఉన్నాం. తండ్రులెంత ఆరాటపడ్డా.. సక్సెస్ అయిన సన్స్ తక్కువే ఉన్నారు. వైవిధ్యమైన కథలు ఎంచుకోవడంలో ఫెయిల్ అయిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తారీ విషయంలో. ముఖ్యంగా తండ్రుల ఇమేజ్ తోనే తనయులనూ పరిచయం చేయాలనుకోవడం మరో ఫెయిల్యూర్ గా చెప్పొచ్చు. అయితే కొడుకుల విషయంలో చూపిన చొరవ కూతుళ్ల విషయలో చూపరు మన హీరోలు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ బాగా ఉన్నా.. సౌత్ లో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. తెలుగులో రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లనూ హీరోయిన్లుగా పరిచయం చేశారు. వీరికి ఇంకా సక్సెస్ రాలేదు. అయితే వీరికంటే ముందే కన్నడలో సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతురు ఐశ్వర్యను అక్కడ హీరోయిన్ గా పరిచయం చేశాడు. పాప మరీ పేలవంగా ఉండటం.. నటనలో సున్నా మార్కులు పడటంతో అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. విశేషం ఏంటంటే.. ఐశ్వర్య గ్లామర్ పరంగానూ రెగ్యులర్ హీరోయిన్లలాగానే చేసింది. బట్ నో టాలెంట్.

అయినా తన కూతురును హీరోయిన్ గా నిలబెట్టాలనే తాపత్రయం అర్జున్ లో తగ్గినట్టు లేదు. అందుకే ఈసారి ఏకంగా తెలుగు సినిమా పరిశ్రమకే పట్టుకువచ్చాడు. తనే డైరెక్ట్ చేస్తూ ఆమెను తెలుగులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఓపెనింగ్ కు పవన్ కళ్యాణ్‌ చీఫ్‌ గెస్ట్ గా వచ్చాడు. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత మరీ ఏమంత లేదు. అటు అర్జున్ కూడా డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి చాలాకాలం అయింది. పైగా సీనియర్. మరి ఈ తరం ఆలోచనలను తన సినిమాలో ప్రతిబింబిస్తాడా లేక తనతరం కథలతో వస్తాడా అనేది చూడాలి.
తన కూతురును తనే డైరక్ట్ చేయడం వల్ల ఆమె టాలెంట్ ను చూపించే ప్రయత్నం చేయొచ్చేమో కానీ.. ఈ తరం కుర్రాళ్లు కోరుకుంటోన్న హీరోయిన్ గా ప్రెజెంట్ చేయడం సాధ్యం కాదు. అందుకే అతను డైరెక్ట్ చేయకుండా మరోదర్శకుడి చేతిలో పెడితే బావుండేది అంటున్నారు. ఏదేమైనా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని తెలిసి కూడా కూతురును హీరోయిన్ గా నిలబెట్టే ప్రయత్నం తనే చేస్తున్న అర్జున్ ను అభినందించాల్సిందే.

Advertisement