సంక్రాంతికి నాలుగు సినిమాలు..రెడీ

సంక్రాంతి.. తెలుగు సినిమా పరిశ్రమకు జనాలకంటే పెద్ద పండగ. సంక్రాంతిని సినిమాతో కలిపి జరుపుకోవడం తెలుగు వారి సంప్రదాయం. అందుకే ఆ టైమ్ లో పెద్ద సినిమాల ఎక్కువగా సందడి చేస్తుంటాయి. పోటీ కూడా భారీగానే ఉంటుంది. ఆ పోటీలో నిలబడి గెలిస్తే ఆ కిక్ వేరే అని స్టార్ హీరోలు కూడా చెప్పుకుంటారు. అందుకే సంక్రాంతికి చాలా రోజుల ముందు నుంచే కర్చీఫ్‌ లు వేస్తుంటారు మేకర్స్. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా ‘కలుద్దాం సంక్రాంతికి’ అంటూ ఓ స్వీట్ వార్నింగ్ లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీంతో సంక్రాంతి పందెం కోళ్లు ఇంకేం ఉన్నాయా అని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మూడు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. మెగాస్టార్ ఎంట్రీతో పోటీ చతుర్ముఖం అయింది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రం వాల్తేర్ వీరయ్య(వర్కింగ్ టైటిల్). చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రంలో మాస్ రాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆ మధ్యే అతను షూటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేశాడు.

ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇక ఇదే సంక్రాంతికి వస్తున్నట్టుగా గతంలోనే ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మూవీ టీమ్ కూడా చెప్పింది.ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్‌ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలోనే విడుదల చేయబోతున్నారు. అప్పటి వరకూ ఇదే పెద్ద సినిమా అనుకున్నారు. రీసెంట్ గా తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తోన్న వారసుడు చిత్రాన్ని కూడా అదే టైమ్ లో విడుదల చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో.. పోటీ మరింత పెరిగింది. ఇక రెండు మూడు రోజుల క్రితమే ఓపెనింగ్ జరుపుకున్న వైష్ణవ్ తేజ్ చిత్రాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేస్తామని చెప్పారు. ఓ రకంగా వీరిది పెద్ద ధైర్యం అనే చెప్పాలి. ఇప్పుడు మెగాస్టార్ కూడా వచ్చేశాడు. మరి ఇంకా ఎన్ని సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటిస్తాయో కానీ ఇప్పటికైతే పోటీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి ఇంకేదైనా పెద్ద సినిమా వస్తే అప్పుడు వైష్ణవ్ తేజ్ కు ఇబ్బంది తప్పదు. లేదూ పెద్దవాళ్ల మధ్య చిన్న సినిమాగా విజయం సాధించినా ఆశ్చర్యం లేదు.

Related Posts