ఏజెంట్ ఎక్కడ అయ్యగారూ..

చాలామంది చెప్పినట్టు ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. చేసే సినిమాల్లో మేటర్ లేకపోతే ఆ గ్రౌండ్ అంతా వేస్ట్ అవుతుంది. అందుకు ఈ మధ్య కాలంలో ఖచ్చితమైన ఉదాహరణ అక్కినేని అఖిల్. అరంగేట్రంతోనే హ్యాట్రిక్ ఫ్లాపులు చూసిన ఏకైక హీరోగా టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయేలా వచ్చాడు.

బట్ లాస్ట్ ఇయర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే మూవీతో మంచి హిట్ కొట్టాడు. ఇక అప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీకి స్టార్డమ్ తేవడంలో అయ్యగారే కరెక్ట్ అనుకున్నారు. కానీ తర్వాత మొదలైన ఏజెంట్ మూవీ ఓ అంతులేని కథలా సాగుతోంది. అసలు ఈ సినిమా పూర్తయిందా..? పూర్తయితే అప్డేట్ ఏంటీ..? ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? అసలు ఈ మూవీకి సంబంధించి ఏం జరుగుతోంది.. ? ఇలా ఎన్నో ప్రశ్నలు. మరి వీటికి ఆన్సర్ చెప్పేవారైనా ఉన్నారా..?


అఖిల్.. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హ్యాండ్సమ్ హీరో. అతన్ని లాంచ్ చేయడానికి నాగార్జున చాలా టైమ్ తీసుకున్నాడు. భారీ ప్రణాళికలు వేసుకున్నారు. చివరికి అప్పుడు మాస్ డైరెక్టర్ గా వినాయక్ చేతుల్లో పెట్టారు. అఖిల్ అనే మూవీతోనే తెరంగేట్రం చేసిన అతన్ని చూసి ఆడియన్స్ పెదవి విరిచారు. అస్సలు నటన తెలియదు అన్నారు.

అటు కథ కూడా వీక్ గా ఉండటంతో మూవీ డిజాస్టర్ అయింది. తర్వాత వరుసగా చేసిన హలో, మిస్టర్ మజ్ను సైతం మెప్పించలేకపోయాయి. చివరగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో హిట్టెక్కాడు. దీంతో ఇక అయ్యగారు లైన్ లో పడ్డాడు అనుకున్నారంతా. ఆ ఊపులోనే మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో మూవీకి కమిట్ అయ్యాడు. ఏజెంట్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో పాటు అతని లుక్ ను కూడా విడుదల చేసినప్పుడు యస్.. అక్కినేని ఫ్యామిలీ నుంచి మాస్ హీరో వచ్చాడు అనుకున్నారు.

బట్ ఈ మూవీ స్టార్ట్ అయ్యి రెండేళ్లవుతున్నా.. ఆ మధ్య వచ్చిన టీజర్ తప్ప ఇంకే అప్డేట్ కనిపించడం లేదు. ఓ దశలో కథ మొత్తం మార్చారు అన్నారు. మరోసారి రీ షూట్స్ అన్నారు. అదే టైమ్ లో లాస్ట్ ఇయర్ దసరా నుంచి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. బట్ ఎప్పుడూ ఆ ఊపు కనిపించలేదు. చివరగా ఈ సంక్రాంతి అన్నారు. అసలు ఊసులోనే లేదిప్పుడు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా..? ఆగిపోయిందా అనే డౌట్స్ అందరిలోనూ ఉన్నాయి. అటు సురేందర్ రెడ్డి కానీ.. ఇటు అఖిల్ కానీ ఏ అప్డేట్ చెప్పడం లేదు. మరి ఈ ఏజెంట్ కథ ఇలా ఇంకెంత కాలం అంతులేని కథలా సాగుతుందో..?

Related Posts