అజిత్ కు ఈ తెగింపుతో ముగింపేనా..

రొటీన్.. ఈ మాట చాలా సినిమాలకు వర్తిస్తుంది. ఇక తమిళ్ లో అయితే స్టార్ హీరోలు కూడా ఈ మాటను దాటి సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. విచిత్రంగా అక్కడి అభిమానులు కూడా వాటినే బ్లాక్ బస్టర్స్ చేస్తుంటారు. బట్ అవే సినిమాలు ఇతర భాషల్లో డబ్ అయితే మాత్రం ఎవరూ పట్టించుకోరు. అంత వీక్ గా ఉంటుంది కంటెంట్.

ఇప్పుడు తెలుగులో తెగింపు అనే టైటిల్ తో రాబోతోన్న అజిత్ కుమార్ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలామంది ఏముందీ ఇందులో అంటున్నారు. మరి ఈ తెగింపు కాస్తా అటూ ఇటైతే.. ఇక అజిత్ తెలుగు మార్కెట్ కు ముగింపు అవుతుందేమో.. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.


అజిత్ కుమార్.. హైదరాబాద్ నుంచే తమిళనాడు వెళ్లిన ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అందగాడుగా సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు. మొదట్లో అన్నీ క్లాస్ సినిమాలే చేసినా తర్వాత మెల్లగా మాస్ రూట్ లోకి వచ్చాడు. ఆల్రెడీ ఉన్న క్లాస్ ఫ్యాన్స్ కు మాస్ ఫ్యాన్స్ కూడా తోడై.. టాప్ హీరోగా మారాడు. అయితే కొన్నాళ్లుగా అతని సినిమాలు చూస్తే బిల్డప్ తప్ప మరోటి కనిపించడం లేదు అనే టాక్ అక్కడ కూడా వినిపిస్తోంది.

ముఖ్యంగా యాక్షన్స్ సీక్వెన్స్ కు ఇస్తోన్న ఇంపార్టెన్స్ కథకు ఉండటం లేదు. ముఖ్యంగా కేవలం తమిళ ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని కథలు ఎ