విశ్వక్ సేన్’దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్‌ తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్సకత్వంలో రాబోతున్న చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. నివేదా పేతురాజ్ కథానాయిక.

దాస్ కా ధమ్కి రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్.  తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్‌ వుంటుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి.

95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌, హరి హర వీర మల్లు చిత్రాలకు  స్టెంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజి తో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్‌ లోని సారధి స్టూడియోస్‌ లో వేసిన భారీ సెట్‌ లో షూటింగ్ జరుగుతోంది.

ఫుకెట్‌ లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్‌ ను, స్పెయిన్‌ లో ఒక చిన్న షెడ్యూల్‌ ను టీమ్ పూర్తి చేసుకుంది. దీపావళి కి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు.

బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్‌ కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌ ను పర్యవేక్షించారు.

చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా,  లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ప్రతి నటుడికి సమానమైన, మంచి ప్రాముఖ్యత ఉంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

10 hours ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

14 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

14 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

17 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

18 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

20 hours ago