బాక్సాఫీస్ పై పరాక్రమం చూపించేలా ఉన్న విక్రమ్ ట్రైలర్

జూన్ 3న చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నాయ్. వాటిల్లో ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఎక్కువ కలిగించిన చిత్రం విక్రమ్. ఖైదీ చిత్రంతో సౌత్ లో హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మలయాళీ టాలెంటెడ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించడంతో సౌత్ లో విక్రమ్ పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. నిన్ననే విక్రమ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్. జూన్ 3న ఈ సినిమా విడుదలవుతోంది. కమల్ హాసన్ తో పాటు ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల తమిళ హీరో విజయ్ సేతపతి, మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విక్రమ్ మూవీలో కీలక పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమాని మల్టిస్టారర్ గానే భావిస్తున్నారు సౌత్ ఆడియన్స్.
విక్రమ్ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై బజ్ ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు ధియేట్రికల్ ట్రైలర్ వచ్చి అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రం ట్రైలర్ నిన్ననే విడుదలై అన్ని బాషల ఆడియన్స్ ను మెప్పిస్తోంది. ఒక రాత్రి మొత్తం సాగే కథగా ఈ సినిమాని తెరకెక్కించారు. కమల్ హాసన్ వర్శెస్ విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ట్రీట్ గా కనిపిస్తోంది. తుపాకుల హోరు, కొడవళ్ళ వేటతో నాన్ స్టాప్ యాక్షన్ ఉండేలా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఏదో జరుగుతోంది అన్న సస్పెన్స్ ని డ్రాగ్ చేయగలిగారు. అదేంటో క్లారిటీగా, కన్ ఫ్యూజన్ లేకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించగలిగేతే విక్రమ్ మూవీ సక్సెస్ అవ్వడం ఖాయం. అనిరుథ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. కమల్, సేతుపతి, ఫహాద్ ల బెస్ట్ పెర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాం అనిపిస్తోంది. అలాగే లోకేష్ కనగరాజ్ టేకింగ్ హైలైట్ గా ఉండబోతుందనే అభిప్రాయం ట్రైలర్ చూసిన వాళ్ళ నుంచి వినిపిస్తోంది. మొత్తంగా జూన్ 3న ఆడియన్స్ కి విక్రమ్ మూవీ స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతుందనే పాజిటివ్ టాక్ మాత్రం కనిపిస్తోంది.

Related Posts