కెజీఎఫ్ చాప్టర్ – 3 .. ఈ యేడాది నుంచే

ఆల్ టైమ్ ఎంటర్టైనర్స్ అనే సినిమాలు కొన్నే ఉంటాయి. అవి ట్రెండ్స్ ను బ్రేక్ చేస్తాయి. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అని కాకుండా ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి అనే చూసేలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రం కెజీఎఫ్. శాండల్ వుడ్ వంటి ఓ చిన్న పరిశ్రమ నుంచి వచ్చిన ఈ మూవీ దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా వచ్చిన కెజీఎఫ్ రెండో చాప్టర్ 2 కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ టైమ్ లో మరో సూపర్ న్యూస్ చెప్పింది మూవీ టీమ్.
తన తల్లి కోరిక మేరకు ప్రపంచంలోనే కుబేరుడు అనిపించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసి.. ఆమె కోరుకున్నట్టుగానే మొత్తం బంగారాన్ని సంపాదించిన రాఖీ భాయ్.. రెండో భాగంలో ఆ బంగారంతో సముద్రంలోకి వెళతాడు. అంతా చనిపోయాడు అనుకున్నా.. అతను బ్రతికే ఉంటాడు అనేలా చూపించి మరో భాగానికి మార్గం వేసుకున్నారు మేకర్స్. నిజానికి ఈ చిత్రానికి సంబంధించి మొదట్నుంచీ మూడు నాలుగు సిరీస్ లు ఉంటాయని చెబుతూనే ఉణ్నారు. మొదటి పార్ట్ లో రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయితే.. రెండో భాగంలో దేశం మొత్తానికీ తెలిశాడు. అంటే ఇక ప్రపంచానికి రాకీ భాయ్ పవర్ చూపించేది తర్వాతి భాగాలన్నమాట.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కెజీఎఫ్ దేశమంతా ప్రభంజనం సృష్టించింది. మేకింగ్ నుంచి టేకింగ్ వరకూ.. షాట్ డివిజన్ నుంచి సినిమాటోగ్రఫీ వరకూ సరికొత్తగా కనిపించడం కూడా ఈ సినిమాకు అదనంగా కలిసొచ్చింది. కథగా చిన్నదే అయినా.. ప్రతి సీనూ ఎలివేషన్ షాట్ లానే కనిపించడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యి.. చూస్తున్నంత సేపూ ఆడియన్స్ ఆ హైప్ లోనే ఉండిపోయారు. అందుకే మాస్ ఆడియన్స్ కు కెజీఎఫ్ ఫీస్ట్ లా కనిపించింది.. సినిమా బిగ్గెస్ట్ గా నిలిచేందుకు కారణమైంది.
ఇక మూడో పార్ట్ కు సంబంధించి మునిగిపోయిన నావలోనే ఓ పుస్తకం ఓ రిపోర్టర్ ను దొరుకుతుందట. దాన్ని ప్రధానమంత్రికి ఇస్తాడతను. దాన్ని బట్టి చూస్తే రాకీ భాయ్ ఇండోనేషియా మీదుగా వెళుతున్నట్టు తెలుస్తుందట. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడు. అతని అంతిమ లక్ష్యం ఏంటనేది మూడో భాగంగా ఉంటుందట. అయితే ఈ పార్ట్ ఎప్పుడు వస్తుందా అనుకున్న వారికి స్వీట్ న్యూస్ చెప్పారు నిర్మాతలు. ఈ యేడాది చివరిలోనే కెజీఎఫ్ మూడో చాప్టర్ మొదలవుతుందట. అంటే ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి చేయగానే కెజీఎఫ్3 స్టార్ట్ అవుతుందన్నమాట. మరి ఈ సారి ఎలాంటి కంటెంట్ తో వస్తాడో చూడాలి.

Related Posts