అదరగొడుతోన్న సర్కారువారి పాట కలెక్షన్స్ ..

మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్లో వచ్చిన కమర్షియల్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట హంగామా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఆడియన్స్ నుంచి హిట్ టాక్ ని, విమర్శకుల నుంచి నెగిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. మహేష్ కెరీర్లో వన్ ఆఫ్ ద టాప్ గ్రాసర్ మూవీగా సర్కారు వారి పాట నిలుస్తుందని ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు చూసి చెప్పొచ్చు.
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట రీసెంట్ గా రిలీజై ఆడియన్స్ నుంచి సక్సెస్ టాక్ వచ్చింది. కానీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కలేదు. విమర్శకులు, నెగిటివ్ రివ్యూస్ ప్రభావం సర్కారు వారి పాటపై ఏమాత్రం కనిపించడం లేదు. కమర్షియల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. మొదటి రోజే 75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా సాధించి…. రెండో రోజుకే వంద కోట్ల క్లబ్ లో చేరింది సర్కారు వారి పాట. ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజుల్లో ఈ సినిమాకి అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. పరశురామ్ డైరెక్షన్లో వచ్చిన సర్కారు వారి పాట మూవీ కమర్షియల్ సక్సెస్ వైపు దూసుకుపోతుంది. మహేష్ బాబు ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్, పాటలు సినిమాకు రిపీట్ ఆడియన్స్ ని తీసుకొస్తున్నాయి. మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 95 కోట్ల షేర్ వచ్చిందని ప్రకటించారు మేకర్స్. అంటే గ్రాస్ కలెక్షన్లు దాదాపు 150 కోట్ల వరకూ ఉంటాయి.
సర్కారు వారి పాట ఒక్క నైజాంలోనే 29 కోట్ల షేర్ రాబట్టింది ఈ మూవీ. సీడెడ్ నాలుగు జిల్లాల్లో కలిపి తొమ్మిది కోట్ల 81 లక్షల షేర్ రాబట్టింది. ఉత్తరాంద్రలో తొమ్మిది కోట్ల 36 లక్షలు వచ్చాయి. కృష్ణా గుంటూరు కలిపి 13 కోట్లు వచ్చాయి. ఈస్ట్ వెస్ట్ కలిపి 11 కోట్లు వచ్చాయి. నెల్లూరు దాదాపు 3 కోట్లు వచ్చింది. టోటల్ ఏపి, తెలంగాణ కలిపి 75 కోట్ల షేర్ వచ్చింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 7.6 కోట్లు రాగా, ఓవర్సీస్ మార్కెట్ లో 12 కోట్లు వచ్చాయి. మొత్తంగా మొదటి నాలుగు రోజుల్లో సర్కారు వారి పాట 95.8 కోట్ల షేర్ సాధించింది. ఇంకా వసూళ్ళు సాలీడ్ గానే ఉండటంతో మహేష్ కెరీర్లో మంచి కమర్షియల్ హిట్ గా నిలవబోతుంది సర్కారు వారి పాట మూవీ.