ఫిబ్రవరిలో వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్‘

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్‘ కొత్త విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అసలు ఈనెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతోనే వాయిదా పడింది. లేటెస్ట్ గా ఫిబ్రవరి 16న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్ గా కనిపించబోతున్నాడు. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ బైలింగ్వల్ గా రాబోతున్న ఈ మూవీని సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. త్వరలో ‘ఆపరేషన్ వాలెంటైన్‘ టీజర్ రానుంది.

Related Posts