యశ్ సరసన నయనతార నటించబోతుంది

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో మంచి స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు కన్నడ స్టార్ యశ్. ‘కె.జి.యఫ్’ సిరీస్ తో యావత్ దేశ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ‘కె.జి.యఫ్ 2’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నా.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఆడియన్స్ ను ఫిదా చేయడానికి వస్తున్నాడు.

మలయాళం డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ ‘టాక్సిక్’ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో యశ్ కి సిస్టర్ రోల్ లో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీన కపూర్ నటించబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇక.. ఈ మూవీలో యశ్ కి జోడీగా నయనతార నటించనుందట. చాలా గ్యాప్ తర్వాత నయనతార నటిస్తున్న కన్నడ సినిమా ఇదే.

‘టాక్సిక్’తో పాటు.. బాలీవుడ్ ‘రామాయణ్’లోనూ నటించబోతున్నాడు యశ్. రణ్‌బీర్ కపూర్ రాముడుగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్న ఈ మైథలాజికల్ మూవీలో రావణుడిగా యశ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ మొదలైంది. త్వరలోనే.. ‘రామాయణ్’లో యశ్ కూడా జాయిన్ అవుతాడు. ఈ సినిమాకోసం రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోనున్నాడట యశ్.

Related Posts