బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ

స్టార్ బోయ్ సిద్ధు సైలెంట్ గా మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తన శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో 37వ చిత్రంగా నిర్మిస్తున్నారు. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే షూటింగ్ స్టార్ట్స్ అంటూ ఈ మూవీకి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. హీరో సిద్ధు, ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మిగతా కాస్ట్ అండ్ క్రూ విశేషాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు హీరోగానే కాకుండా తన సినిమాలకు రచయితగానూ వ్యవహరిస్తుంటాడు సిద్ధు జొన్నలగడ్డ. ‘డిజె టిల్లు‘ తర్వాత ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన సిద్ధు.. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్‘ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు నీరజ కోన డైరెక్టోరియల్ డెబ్యూ ‘తెలుసు కదా‘లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో మరో మూవీ. మొత్తంమీద.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో స్పీడు పెంచుతున్నాడు సిద్ధు.

Related Posts