పుల్వామా జవాన్ల స్మారక ప్రదేశాన్ని సందర్శించిన వరుణ్‌తేజ్‌

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌ అప్‌కమింగ్ ఫిల్మ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. శక్తి ప్రతాప్‌సింగ్ హడా డైరెక్షన్‌లో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం వైమానిక దళ వీరత్వాన్ని ప్రదర్శించే విధంగా అద్భుతంగా తెరకెక్కిందంటున్నారు మేకర్స్‌. రిలీజ్‌ చేసిన ప్రమోషనల్ వీడియోస్‌, లిరికల్ సాంగ్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. రీసెంట్ ఈ చిత్ర హీరో వరుణ్‌ తేజ్‌ అండ్ ఫిల్మ్‌ టీమ్‌ పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల స్మారక ప్రదేశాన్ని సందర్శించి ఘన నివాళి అర్పించారు.
ఆపరేషన్ వాలెంటైన్ భారతదేశం వైమానిక దళ ధైర్య సాహసాలు, త్యాగాల స్ఫూర్తితో నిజమైన సంఘటనల ప్రేరణతో రూపొందించారు. ఇది దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. మన వైమానిక దళ వీరుల అసమానమైన స్ఫూర్తిని, పోరాటాన్ని, భయంకరమైన వైమానిక దాడులలో ఎదుర్కొన్న సవాళ్లను అద్భుతంగా
చుపించనున్నారు.


ఈ చిత్రంతో వరుణ్ తేజ్ బాలీవుడ్ డెబ్యు చేస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ కనిపించనుంది. రుహానీ శర్మ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related Posts