‘పద్మవ్యూహంలో చక్రధారి’ చిత్ర టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌

సంజయ్‌రెడ్డి బండారపు డైరెక్షన్‌లో .. కె.ఓ.రామరాజు నిర్మిస్తున్న మూవీకి టైటిల్‌ అనౌన్స్‌ చేసారు. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ , శశికాటిక్కో, అషురెడ్డి మెయిన్‌ లీడ్ చేస్తున్న మూవీ ఇది. ఈ మూవీకి ‘పద్మవ్యూహంలో చక్రధారి’ అనే టైటిల్‌ అనౌన్స్‌ చేసారు. ఈ టైటిల్‌ అనౌన్స్‌మెంట్ ప్రెస్‌మీట్‌ కు ముఖ్య అతిధిగా శ్రీరామ్‌ ఆదిత్య విచ్చేసారు.


ఈ చిత్రానికి టైటిల్‌ ‘పద్మవ్యూహంలో చక్రధారి’ అనే టైటిల్‌ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. పోస్టర్‌ చాలా బాగుందనీ.. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య. మరో దర్శకుడు కృష్ణ చైతన్య కూడా ఈ చిత్ర టైటిల్‌ను మెచ్చుకున్నారు. టైటిల్‌ యూనిక్‌గా ఉందన్నారు.
ఫస్ట్‌లవ్‌ దగ్గరే ఆగిపోయిన ఓ వ్యక్తి.. దాన్నుంచి ఎలా బయటపడ్డాడనే కాన్సెప్ట్‌తో రూపొందే చిత్రమే ఈ ‘పద్మవ్యూహంలో చక్రధారి’ అన్నారు హీరో ప్రవీణ్‌రాజ్‌కుమార్‌. వేడుకకు వచ్చిన అతిధులు ఆహ్వానితులకు కృతజ్ఞతలు తెలియజేసారు.


రాయలసీమ ప్రాంతం అంటే కక్షలు, ఫ్యాక్షన్ గొడవలనే ఇప్పటిదాకా తెరపై చూపించారు. అయితే ఈ చిత్రంలో రాయలసీమ స్వచ్చమైన ప్రేమను చూడబోతున్నారన్నారు దర్శకుడు సంజయ్‌రెడ్డి బండారపు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది అన్నారు డైరెక్టర్‌.
కొత్తగా వచ్చిన నిర్మాతలకు మా వంతు హెల్ప్ చేయడానికి ప్రయతిస్తాం. కొత్తగా వచ్చిన నిర్మాతలకు సానుకూల వాతావరణం కల్పించి ఆదరించాలని ఇండస్ట్రీని కూడా కోరుతున్నాను. పద్మ వ్యూహంలో చక్రధారి’ చిత్రo బృందానికి అభినందనలు” తెలిపారు దర్శకుడు వీరశంకర్.

Related Posts