వాలెంటైన్స్ డే స్పెషల్ మూవీస్

రీ-రిలీజుల హంగామా పూర్వం ఎక్కువగా ఉండేది. అప్పట్లో థియేటర్లు ఒక్కటే ఎంటర్ టైన్ మెంట్. కాబట్టి రీ-రిలీజుల్లో కూడా కొన్ని సినిమాలు వందేసి రోజులు ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మళ్లీ దశాబ్దాల తర్వాత ఈమధ్య రీ-రిలీజుల హంగామా పెరిగింది. స్టార్ హీరోల సినిమాలను వరుసగా రీ-రిలీజ్ చేస్తూ ఓపెనింగ్ డే కలెక్షన్లను తమ కిట్టీలో వేసుకుంటున్నారు నిర్మాతలు.

ఈరోజు (ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డే సందర్భంగా పలు ప్రేమకథా చిత్రాలు థియేటర్లకు క్యూ కట్టాయి. వీటిలో తెలుగు నుంచి కొన్ని.. హిందీ నుంచి మరికొన్ని.. అలాగే ఓ ఇంగ్లీష్ మూవీ కూడా ఉంది. తెలుగు చిత్రాల విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ రొమాంటిక్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ గురించి చెప్పుకోవాలి. విడుదలై పాతికేళ్లయినా.. ఇప్పటికీ ఈ మూవీలో పవన్ వింటేజ్ లుక్.. ఆడియన్స్ కు ఫ్రెష్ గా కనిపిస్తుంది. పవన్, కీర్తి ప్యూర్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే ఉంటుంది.

ఇంకా.. తెలుగు నుంచి దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’, సిద్ధార్థ్ ‘ఓయ్’, సూర్య ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి చిత్రాలు ప్రేమికులరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. లాస్ట్ ఇయర్ రిలీజైన కల్ట్ బ్లాక్ బస్టర్ ‘బేబీ’ కూడా ఈ వాలైంటైన్స్ డే కి హాట్ ఫేవరెట్ గా థియేటర్లలోకి దిగుతోంది.

హిందీ నుంచి కింగ్ ఖాన్ షారుక్ ఆల్ టైమ్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, వీర్ జరా, మొహబ్బతే’ సినిమాలు ప్రేమికులరోజు కానుకగా హైదరాబాద్ థియేటర్లలో రీ-రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు హాలీవుడ్ నుంచి ‘టైటానిక్’ వాలైంటైన్స్ డే స్పెషల్ గా రీ-రిలీజ్ అవుతుండడం విశేషం. మరి.. ఈ వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్ లో ఏఏ చిత్రాలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Related Posts