మరోసారి దసరా బరిలో నటసింహం

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. నేటితరం సీనియర్ హీరోలే కాదు.. యంగ్ హీరోలకు కూడా మించిన రీతిలో వరుస బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంటున్నాడు. పోయినేడాది దసరా కానుకగా ‘భగవంత్ కేసరి’ని విడుదల చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య.. ఈ ఏడాది దసరా కానుకగా బాబీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు.

బాలకృష్ణ 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ పక్కా ప్లానింగ్ తో సాగుతోంది. ఇప్పటికే 30 శాతం షూట్ కంప్లీట్ అయిన ఈ సినిమా.. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈనెలాఖరు వరకూ అక్కడే చిత్రీకరణ సాగనుందట.

అయితే.. మార్చి నుంచి బాలకృష్ణ ఎన్నికల హడావుడిలో ఉంటాడు. ఈనేపథ్యంలో.. ఈ చిత్రంలో బాలకృష్ణ లేని సన్నివేశాలను పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట డైరెక్టర్ బాబీ. ఎన్నికల తర్వాత బాలయ్యతో సీన్స్ ను పూర్తిచేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కాస్త ఎక్కువ సమయం తీసుకుని ఈ ఏడాది దసరా బరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉందట టీమ్. మొత్తంమీద.. గత ఏడాది సంక్రాంతి, దసరా బరిల్లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య.. ఈసారి మాత్రం దసరా టు దసరా అంటూ కొత్త సినిమాకోసం ఏడాది సమయం తీసుకోబోతున్నాడు.

Related Posts