కేరళను ఊపేస్తోన్న హైదరాబాద్ ‘ప్రేమలు’

మలయాళం సినిమాలు ఎక్కువగా కేరళ ఇతివృత్తంతో సాగుతుంటాయి. కొన్నిసార్లు తమిళ వాసనలు కనిపిస్తాయి. అయితే.. కొన్నేళ్ల క్రితం బెంగళూరు డేస్ అని ఆద్యంతం బెంగళూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా కేరళను ఓ ఊపు ఊపింది. ఇప్పుడు హైదరాబాద్ వంతొచ్చింది. లేటెస్ట్ గా కేరళలో విడుదలైన ‘ప్రేమలు’ చిత్రం హైదరాబాద్ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రం.

‘పుష్ప’తో టాలీవుడ్ కి పరిచయమైన స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కొంతమంది కొత్త జంటలతో ఆద్యంతం ప్రేమకథా చిత్రంగా ‘ప్రేమలు’ సినిమాని గిరీష్ ఎ.డి. తెరకెక్కించాడు. ఫిబ్రవరి 9న కేరళలో విడుదలైన ‘ప్రేమలు’ ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘ప్రేమలు’ అచ్చమైన తెలుగు టైటిల్ లా అనిపించే ఈ మూవీ స్టోరీలో హైదరాబాద్ కూడా ఒక భాగం.

సాఫ్ట్ వేర్ జాబ్స్ కి అడ్డాగా నిలిచే హైదరాబాద్ లోని అందమైన లొకేషన్స్ ఈ మూవీలో కట్టిపడేస్తాయి. అదే ఒకరకంగా కేరళ ఆడియన్స్ కి ఈ సినిమా ఓ కొత్త ఫీల్ కలిగించిందని చెప్పొచ్చు. సహజత్వానికి పెద్ద పీట వేసే మలయాళం డైరెక్టర్స్.. ఈ సినిమాని మంచి రొమాంటిక్ ఫీల్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దడంతో థియేటర్లలో దూసుకుపోతుంది. త్వరలోనే ఈ చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యే అవకాశాలున్నాయట.

Related Posts