కర్మ సిద్దాంతం చెప్పే ‘ఊరిపేరు భైరవకోన’ : దర్శకుడు విఐ ఆనంద్

యంగ్ హీరో సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌లు మెయిన్‌ లీడ్ చేస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ ‘ఊరిపేరు భైరవకోన’. ఏకె ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి డిఫరెంట్ చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్‌ డైరెక్ట్‌ చేసారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16 గ్రాండ్ వరల్డ్ వైడ్ రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ విఐ ఆనంద్‌ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.


టైగర్‌ తర్వాత సందీప్‌ నేను కలిసి సినిమా చేయాలనుకున్నపుడు ఓ రెండు ఐడియాలు చెప్తే భైరవకోన ఐడియాకు సందీప్‌ కిషన్ ఎగ్జయిట్ అయ్యాడు. అందుకే ఈ కథను సిద్దం చేసానన్నారు దర్శకుడు. ఈ కథను డిస్కోరాజా సినిమా టైమ్‌ లో రాసుకునే టైమ్‌ దొరికిందన్నారు.


టైటిల్ మైథాలజీ టచ్ వుంది. ఈ కథలో కూడా కర్మ సిద్ధాంతం, గరుడపురాణం, శివడండం లాంటి నేపధ్యాలు వున్నాయి కాబట్టి ఈ టైటిల్ సరిగ్గా నప్పుతుంది. కర్మ సిద్ధాంతం నియమంలోనే ఈ కథ వుంటుందన్నారు.
‘ఊరు పేరు భైరవకోన’ పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందనే నమ్మకం వుంది. నా కెరీర్ లోనే బిగ్గర్ ఓపెనింగ్ భైరవకోనకి రావడం చాలా ఆనందంగా వుందన్నారు. అనిల్ గారు, రాజేష్ గారు కథని చాలా బలంగా నమ్మి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. జనాలని థియేటర్స్ తీసుకురావాలంటే వారికి కావాల్సిన విజువల్ ఎక్స్ పీరియన్స్, కంటెంట్ ఇవ్వాలని ముందే నిర్ణయించుకొని సినిమా చేశామన్నారు.


ఇందులో వెన్నెల కిషోర్ ట్రాక్ భలే వర్క్ అవుట్ అయ్యింది. డాక్టర్ నారప్ప అనే హిలేరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే వైవా హర్ష పాత్రలో కూడా ఫన్ ఎలిమెంట్ భలే కుదిరింది. అలాగే కావ్య థాపర్ లో కూడా చాలా ఫన్నీగా ఇంట్రస్టింగా వుంటుంది. ఇందులో చాలా మంచి ఫన్ వుందన్నారు విఐ ఆనంద్.
ప్రతి పదినిమిషాలకు ప్రేక్షకులు ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా వుంటుందన్నారు.సందీప్ లో అప్పుడు వున్న ఫైర్, ప్యాషన్ ఇప్పుడూ వుంది. తనకి అలసట లేదు. ప్రతి సినిమాని మొదటి సినిమాలనే నమ్మి పని చేస్తున్నారు. నటన పరంగా చాలా పరిణతి సాధించారు.ఇందులో నిజమేనా పాట పెద్ద హిట్ అయ్యింది. సినిమాలో లీడ్ పెయిర్ మధ్య వచ్చే కీలకమైన పాట ఇది. వారి లవ్ కెమిస్ట్రీ కి హెల్ప్ అవుతుందని అనుకున్నాను. కానీ ఇంత పెద్ద రీచ్ వస్తుందని అనుకోలేదన్నారు.
తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ.. నిఖిల్ తో ఓ సినిమా చర్చల్లో వుంది. కథ రాస్తున్నాను. అలాగే ఓ పెద్ద హీరోకి కథ రాస్తున్నాను. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తానన్నారు విఐ ఆనంద్‌.

Related Posts