తండ్రీ కొడుకుల ఎమోషనల్‌ జర్నీ LYF – Love Your Father

శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి సూపర్‌డూపర్‌ హిట్ చిత్రాలు నిర్మించిన సంస్థ మనీషా ఆర్ట్స్‌. ఈ సంస్థ నుంచి ప్రస్తుతం LYF – లవ్‌ యువర్‌ ఫాదర్ చిత్రం రాబోతుంది. పవన్‌ కేతరాజు డైరెక్షన్‌లో కిశోర్‌రాఠీ, మహేష్‌ రాఠీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మల్లారెడ్డి కాలేజ్‌లో గ్రాండ్ ఓపెనింగ్ జరుపుకుంది.
ఈచిత్రంలో శ్రీహర్ష , కషిక కపూర్‌ లు జంటగా నటిస్తున్నారు. మల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌ చైర్మన్‌ కామకూర శాలిని కెమెరా స్విచ్చాన్ చేయగా.. CMR గ్రూప్ చైర్మన్‌ గోపాల్‌ రెడ్డి క్లాప్‌కొట్టారు. ప్రవీణ్‌ రెడ్డి, శ్రీశైలం రెడ్డి, గోపాల్‌ రెడ్డి, సంతోష్‌ రెడ్డిలు స్క్రిప్ట్ అందించారు. మల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌, మల్లారెడ్డి హాస్పిటల్స్ చైర్మన్‌ భద్రారెడ్డి , కాలేజ్‌ ప్రిన్సిపల్ ఏ రామస్వామి రెడ్డి ఇతరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

దేవుడు తర్వాత స్థానం తండ్రిదే. అందుకే లైఫ్‌ – లవ్‌ యువర్‌ ఫాదర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా తండ్రి ఆశీస్సులు మాకు మెండుగా ఉంటాయన్నారు నిర్మాత కిశోర్‌ రాఠీ.

ది నా మొదటి సినిమా 100% కష్టపడి అందరికీ నచ్చే విధంగా చేస్తాను. మీ సపోర్ట్ మరియు ఆశీర్వాదాలు ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు హీరో శ్రీహర్ష.


గతంలో కో డైరెక్టర్ గా చాలా సినిమాలకు వర్క్ చేశాను. కిషోర్ రాఠీ గారు నన్ను స్వయంగా పిలిచి ఈ సినిమా నాకు ఇవ్వడం జరిగింది. సూర్య ది గ్రేట్, దర్యాప్తు, యమలీల, మాయలోడు, వినోదం లాంటి ఎన్నో మంచి హిట్ సినిమాలు అందించిన మనిషా ఫిలిమ్స్ బ్యానర్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ గారు నన్ను పిలిచే అవకాశం చాలా ఆనందంగా ఉంది. కిషోర్ రాఠీ గారి లైఫ్ లోని చిన్న ఇన్సిడెంట్ ని తీసుకునే కాదని డెవలప్ చేసుకోవడం జరిగింది. తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ ఈ సినిమా లైఫ్ ‘లవ్ యువర్ ఫాదర్’ అన్నారు దర్శకుడు పవన్‌ కేతరాజు.

Related Posts