బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ హాల్‌ ఆఫ్ ఫేమర్స్‌ 2023 లో ‘హాయ్‌ నాన్న’ హవా

హాయ్‌ నాన్న.. నేచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రం ఆడియెన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. నాని, మృణాల్‌ ఠాకూర్‌ల నటన ఈ చిత్రానికి ప్రాణం పోసింది. ఇప్పుడు బిహైండ్‌ వుడ్స్‌ గోల్డ్ హాల్‌ ఆఫ్ ఫేమర్స్ అవార్డుల విషయంలోనూ సంచలనం సృష్టించింది.


నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబి కియారా మెయిన్‌లీడ్‌తో మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా శౌర్యువ్‌ డైరెక్షన్‌లో రూపొందించిన చిత్రం హాయ్‌ నాన్న ప్రేక్షకుల మనసులను కదిలించింది. ఇప్పుడు బిహైండ్‌ వుడ్స్‌ గోల్డ్ హాల్‌ ఆఫ్ ఫేమర్స్‌ 2023 తో 3 అవార్డులు గెల్చుకుని సంచలనం సృష్టించింది.
బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్‌ ఆఫ్ ఫేమర్స్‌ 2023 గా హాయ్‌ నాన్న లో నాని నటన కు ఉత్తమ నటుడి అవార్డ్‌ వరించింది. అలాగే ఉత్తమనటిగా మృణాల్‌ ఠాకూర్‌, ఉత్తమ ఫిల్మ్‌ మేకర్‌గా శౌర్యువ్‌లు అవార్డులు గెలుచుకున్నారు.

Related Posts