కొణిదెల వారి కోడలు ఉపాసన, స్టార్ హీరోయిన్ సమంత.. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే.. చైతన్యతో విడిపోయి బాధలో ఉన్న సమంతకు అండగా నిలిచింది ఉపాసన. దీపావళి రోజున సమంతకు స్పెషల్ పార్టీ ఇచ్చింది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు వీరిద్దరి మధ్య ఎంతటి అనుబంధం ఉందో. ఇదిలా ఉంటే.. మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం తన సోదరి అనుష్పల కామినేని వివాహ వేడుకల్లో ఫుల్ బుజీగా ఉంది. ఉపాసన సొంత ఊరు దోమకొండ గడికోటలో ఈ వివాహం చాలా గ్రాండ్ గా జరగనుంది.
ఈ సందర్బంగా కామినేని వారి సాంప్రదాయం ప్రకారం… పెళ్లికి ముందు పోచమ్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ కుటుంబం కూడా హాజరైంది. ఈ సెలబ్రేషన్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన సందడి చేశారు. ఆ ఫోటోలను వీడియోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది. అంతే కాకుండా తొమ్మిదేళ్ల క్రితం తన పెళ్లి వేడుకల్లో భాగంగా పోచమ్మ పండుగ కోసం వేసుకున్న దుస్తులను కొంచెం రీక్రియేట్ చేసి మరీ తన సోదరి మ్యారేజ్ సందర్భంగా వేసుకున్నట్టుగా చెప్పింది.
ఇందులో బాగంగానే… తన పెళ్లినాటి కొన్ని జ్ఞాపకాలను కూడా గుర్తుచేసుకుంటూ మురుసిపోయింది ఉపాసన. తొమ్మిదేళ్ల క్రితం తన పెళ్లి వేడుకల్లో భాగంగా పోచమ్మ పండుగ కోసం వేసుకున్న దుస్తులను కొంచం రీక్రియేట్ చేసి… ఇప్పుడు తన సోదరి వివాహ వేడుక సందర్భంగా వేసుకున్నట్లుగా ఉపాసన చెప్పుకొచ్చింది. అలాగే తన డ్రెస్ ను రీక్రియేట్ చేసినందుకు అనామిక ఖన్నాకు థ్యాంక్స్ అని చెప్పింది. వాటితోపాట తన మ్యారేజ్ ఫొటోలను కూడా షేర్ చేసింది ఉపాసన. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌కు సమంత బ్యూటిఫుల్ అంటూ స్పందించింది.
Allari Naresh is the hero who crossed the milestone of 50 films in Telugu within…
Kajal Aggarwal will be seen in the role of a powerful police officer in the…
Nagarjuna and Dhanush's multi-starrer 'Kubera' is being made. Director Shekhar Kammula is making 'Kubera' with…
From his debut movie 'Alludu Seenu' to last year's 'Chatrapathi', Bellamkonda Srinivas got a good…
Superstar Mahesh Babu has now become super stylish. With long hair.. in a clean shaven…
The title is as important as the story of a movie. The more catchy the…