తెరపైకి వచ్చిన ఊహించని కాంబినేషన్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి అసలెవరూ ఊహించని కాంబినేషన్స్ తెరపైకి వస్తుంటాయి. ప్రెజెంట్ టాలీవుడ్ లో అలాంటివే ఓ రెండు కాంబినేషన్స్ అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతున్నాయి. వాటిలో ఒకటి నటసింహం బాలకృష్ణ, హరీష్ శంకర్ కాంబో. ఎక్కువగా మెగా కాంపౌండ్ హీరోలతోనే పనిచేసిన హరీష్ శంకర్ స్కూలే డిఫరెంట్. అలాంటిది ఇప్పుడు నటసింహం బాలకృష్ణతో సినిమాకి సమాయత్తమవుతున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
వీరిద్దరి కాంబినేషన్ ను కన్నడ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ సెట్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాని చేస్తున్నాడు. హరీష్ శంకర్.. రవితేజాతో ‘మిస్టర్ బచ్చన్‘ చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ ఉంది. అయితే.. పవన్ సినిమా షూటింగ్ ఇంకాస్త లేటయ్యే అవకాశం ఉంది. దీంతో.. రవితేజ ‘మిస్టర్ బచ్చన్‘ తర్వాత వెంటనే బాలకృష్ణతో సినిమాని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట హరీష్ శంకర్.

బాలకృష్ణ-హరీష్ శంకర్ కాంబో తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న మరో న్యూ కాంబో బోయపాటి శ్రీను-విజయ్ దేవరకొండ. అసలు ఎవరూ ఊహించని ఈ రేర్ కాంబో కూడా ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గీతా ఆర్ట్స్ లో బోయపాటి శ్రీను ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తాడనే ప్రచారం జరుగుతుంది.

Related Posts