సొంత నిర్మాణంలో సమంత కొత్త సినిమా

తెలుగులో ఎక్కువ కాలంపాటు సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగించిన హీరోయిన్స్ లో సమంత ముందు వరుసలో నిలుస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్ లలో దాదాపు అందరు అగ్ర కథానాయకులను కవర్ చేసిన సమంత.. మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో సినిమాలు తగ్గించేసింది. తెలుగులో ‘ఖుషి‘ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు.

ఈరోజు (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా సామ్ కొత్త సినిమాని అనౌన్స్ చేసింది. తన సొంత నిర్మాణ సంస్థ ‘త్రాలల మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ పై ‘మా ఇంటి బంగారం‘ పేరుతో సినిమాని ప్రకటించింది. ఈ మూవీలో తానే హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్టర్ లో సమంత చీరకట్టుకొని, మెడలో తాళిబొట్టుతో, చేతిలో తుపాకీ పట్టుకొని సీరియస్ గా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు, మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటించిన ‘సిటాడెల్‘ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Related Posts