ఇది ప్రతాప్ పోతన్ కోరుకున్న చావు..

దక్షిణాది చిత్రసీమ ఓ దిగ్గజ నటుడుని కోల్పోయింది. ఆయన నటుడు మాత్రమే కాదు. నిర్మాత, దర్శకుడు, కథకుడు కూడా. అన్ని విభాగాల్లో అనేక రాష్ట్ర, జాతీయ పురస్కారాలు అందుకున్న ఆ ప్రతిభావంతమైన నటుడు ప్రతాప్ పోతన్. తెలుగు వారికి తక్కువగానే పరిచయం ఉన్న ఈయన ఇండియన్ సినిమా లవర్స్ కు మాత్రం బాగా తెలుసు. తెలుగులో నాగార్జున నటించిన చైతన్య, కమల్ హాసన్ చేసిన ఆకలి రాజ్యం సినిమాల్లో కనిపించారు. తెలుగులో చివరి సినిమా గ్రే విడుదల కావాల్సి ఉంది. 70యేళ్ల వయసులో చెన్నైలోని తన అపార్ట్ మెంట్ లో నిద్రలోనే కన్నుమూశారు ప్రతాప్ పోతన్.ప్రతాప్ పోతన్.. మలయాళీ. సినిమా ప్రయాణం అక్కడే మొదలైనా తర్వాత తమిళ్ పరిశ్రమలోనూ వరుసగా నటించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆరవం అనే సినిమాతో తెరకు పరిచయం అయ్యారు. రెండో సినిమా తకరాతోనే బెస్ట్ యాక్టర్ గా కేరళ స్టేట్ అవార్డ్ అందుకున్నారు. ప్రతాప్ పోతన్ ది టిపికల్ యాక్టింగ్ స్టైల్. చాలా తక్కువ టైమ్ లోనే తనదైన స్టైల్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ స్టైల్ కు నాటి యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ముఖ్యంగా తన మొహం కంటే పెద్దదైన కళ్లజోడుతో బాగా పాపులర్ అయ్యారు. ఆ స్టైల్ ను చాలామంది ఫాలో అయ్యారు కూడా. అది చివరి వరకూ కంటిన్యూ చేశారు ప్రతాప్.

తెలుగులో మూడు నాలుగు సినిమాలు మాత్రమే చేశారు ప్రతాప్. ఫస్ట్ టైమ్ నాగార్జున చైతన్య సినిమాలో కనిపించారు. తర్వాత కె బాలచందర్ రూపొందించిన ఆకలిరాజ్యంలో మరపురాని పాత్ర చేశారు. అలాగే సచిన్ నటించిన వీడెవడులోనూ కనిపించారు. 1985లో మీండుమ్ ఒరు కాదల్ కథై చిత్రంతో దర్శకుడుగా మారారు. అంటే మళ్లీ ఒక ప్రేమకథ అని అర్థం. ఈ చిత్రానికి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా ఇందిరాగాంధీ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఈ సినిమాలో నటించిన రాధికను అదే యేడాది పెళ్లి చేసుకున్నారు. కానీ యేడాదిలోపే విడిపోయారు.ఎలా చూసినా సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ ఓ సెపరేట్ పేజ్ క్రియేట్ చేసుకున్నారు ప్రతాప్ పోతన్. అందుకు కారణం కె బాలచందర్, బాలు మహేంద్ర, మహేంద్రన్, భరతన్ వంటి నాటి దిగ్గజ దర్శకులతో కలిసి పనిచేయడమే. ప్రస్తుతం మూడు మళయాల సినిమాల్లో నటిస్తోన్న ప్రతాప్ చివరిగా తెలుగులో గ్రే అనే ఎక్స్ పర్మెంటల్ మూవీలో నటించారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. ఎప్పుడు చనిపోయినా సహజంగానే పోవాలనేది తన కోరిక అని తరచూ చెప్పేవారు ప్రతాప్ పోతన్. చివరికి అలాగే మరణించారు. ఈ దిగ్గజ నట దర్శకుడికి 70ఎమ్ఎమ్ నివాళులు అర్పిస్తోంది.

Related Posts