గార్గి మూవీ రివ్యూ..

ప్రతాప్ పోతన్
ఏజెంట్ టీజర్
ది వారియర్ ఫస్ట్ డే కలెక్షన్స్
రివ్యూ :- గార్గి
తారాగణం :- సాయి పల్లవి, కవితాలయ కృష్ణమూర్తి, కాళీ వెంకట్, ఆర్ఎస్ శివాజీ, శరవణన్, జయ ప్రకాష్‌ తదితరులు
సంగీతం :- గోవింద్ వసంత్
సినిమాటోగ్రఫీ :- శ్రేయంతి, ప్రేమ్ కృష్ణ అకట్టు
నిర్మాత, దర్శకత్వం :- గౌతమ్ రామ్ చంద్రన్

సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని చూసి తప్పుకుని పోతాం. మరికొన్ని పట్టించుకోకుండా పోతాం. అలాంటి సంఘటనల్లో ఆడవారిపై లైంగిక వేధింపులు అనే వార్తలూ ఉంటాయి. ఇందులో చిన్న పిల్లలపై జరిగే దారుణాలూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక్క క్షణం మాత్రం అయ్యో పాపం అనుకుంటాం. బట్.. అలాంటి ఘటనల్లో నిందుతులు, బాధితుల కుటుంబాల్లో కనిపించే వేదన, సమాజంలో కనిపించే ఉద్రిక్తత, కోర్ట్ లు, పోలీస్ స్టేషన్స్ లో ఉండే డ్రామా.. ఇవన్నీ కలిపి ఓ సినిమా చేస్తే.. అదే గార్గి. సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. అన్నీ తానే అయి ఈ సినిమాను థియేటర్స్ వరకూ తెచ్చిన సాయి పల్లవి నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :-
గార్గి.. కథగా చూస్తే.. గార్గి( సాయిపల్లవి) అనే అమ్మాయి ఓ స్కూల్ టీచర్. తండ్రి వాచ్ మెన్. చెల్లి చదువుకుంటుంది. తల్లి ఇంట్లోనే చిరు వ్యాపారం చేస్తుంటుంది. ఉన్నంతలో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఓ రోజు పెద్ద సంఘటన జరుగుతుంది. గార్గి తండ్రి బ్రహ్మానందంను ఓ చిన్న పాపై లైంగిక దాడి చేశాడనే కారణంతో అరెస్ట్ చేస్తారు. తన తండ్రి అలాంటి వాడు కాదు అంటూ గార్గి పోరాటం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో తను ఎదుర్కొన్న అవమానాలు, చీత్కారాలు ఎన్నో ఉంటాయి. ఓ చిన్న లాయర్ అండతో తన తండ్రి నిర్దోషి అని నిరూపించే ప్రయత్నంలో తను గెలిచిందా లేదా అనేది కథ.

గార్గి సినిమాను కథగా చాలా పెద్దది. దాని చుట్టూ అల్లుకున్న కథనంలోని ఎమోషన్ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. పరిమిత పాత్రలతో అద్భుతమైన సినిమాగా దర్శకుడు గౌతమ్ రామ్ చంద్రన్ ఈ చిత్రాన్ని మలిచారు. ఓ తొమ్మిదేళ్ల పాపపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేస్తారు. అందులో నలుగురినీ పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. కానీ నెల రోజుల తర్వాత ఐదో వ్యక్తిగా గార్గి తండ్రినీ కేస్ లో చేరుస్తారు. అతను ఇద్దరు ఆడపిల్లల తండ్రి. తన తండ్రి చిన్నతనం నుంచీ తెలుసు కాబట్టి అతను తప్పు చేయడు అనే నమ్మకం గార్గిది. నెల రోజుల పాటు పరిశీలించిన తర్వాతే కేస్ లో పేరు చేర్చామనే పోలీస్ ల వాదన. ఈ రెండిటి మధ్య బాధితురాలైన పాప తండ్రి పడే ఆవేదన. వెరసి ఇదో హృద్యమైన సినిమా. మనసులను మెలిపెడుతూ, హృదయాలను బరువెక్కిస్తూ.. సాగే కథనం. ఇలాంటి కథలో అద్భుతమైన ట్విస్ట్ లను కూడా యాడ్ చేసిన దర్శకుడు.. సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాడు. దీంతో ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమాగా నిలిచిపోతుంది.
గార్గిగా సాయి పల్లవి నట విశ్వరూపం ఈ సినిమా. పాప తండ్రి పాత్రలో నటించిన శరవణన్ ఇప్పటి వరకూ విలన్ గానే కనిపించాడు.

ఈ మూవీలో కంటతడి పెట్టించే నటన చూపించాడు. లాయర్ గా కాళీ చరణ్‌ నవ్విస్తూనే కథను నడిపించాడు. సాయి పల్లవి తండ్రిగా ఆర్ఎస్ శివాజీ, లాయర్లుగా సీనియర్ యాక్టర్స్ జయ ప్రకాష్‌, కవితాలయ కృష్ణమూర్తి సహజ నటనతో ఆకట్టుకున్నారు. మొత్తంగా ఇదో గొప్ప సినిమా. కుటుంబం అంతా కలిసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు.దర్శకుడు గౌతమ్ రామ్ చంద్రన్ కు ఇది తొలి సినిమా. నిర్మాత కూడా అతనే. అతను స్వతహాగా లాయర్. అందుకే కోర్ట్ రూమ్ డ్రామాను మనం ఇప్పటి వరకూ చూసిన కమర్షియల్ కోణంలో కాక.. వాస్తవికంగా చిత్రించాడు. ఇలాంటి కేస్ లలో పోలీస్ ల ప్రవర్తన ఎలా ఉంటుంది. సమాజం ఎలా స్పందిస్తుంది. అనే అంశాలను కూడా చాలా బాగా డీల్ చేశాడు. దర్శకుడుగా అతని టేకింగ్, షాట్ డివిజన్, సింబాలిక్ షాట్స్ సింప్లీ సూపర్బ్. గోవింద్ వసంత్ సంగీతం అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. మాటలు ఇది తెలుగు సినిమానే అన్నంత సహజంగా ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా కనీసం పది నిమిషాలైనా ట్రిమ్ చేయొచ్చు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. నిర్మాణ విలువలు సహజంగా కుదిరాయి.

ఫైనల్ :- గార్గి .. మస్ట్ వాచ్ మూవీ
రేటింగ్ :- 4/5

– యశ్వంత్ బాబు

Related Posts